Ashwin-Afridi: ఆ పాక్ పేసర్ ఐపీఎల్‌ వేలంలోకి వస్తే 15 కోట్లకు అమ్ముడుపోతాడు.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

R Ashwin on  Shaheen Afridi IPL Price. పాకిస్తాన్‌ స్పీడ్‌స్టర్‌ షాహిన్‌ షా ఆఫ్రిదిపై ఆర్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 2, 2022, 05:03 PM IST
  • ఆ పాక్ పేసర్ 15 కోట్లకు అమ్ముడుపోతాడు
  • అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
  • అనతి కాలంలోనే స్టార్
Ashwin-Afridi: ఆ పాక్ పేసర్ ఐపీఎల్‌ వేలంలోకి వస్తే 15 కోట్లకు అమ్ముడుపోతాడు.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

R Ashwin on  Shaheen Afridi IPL Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాసుల వర్షం కురిపించే ఈ మెగా టోర్నీలో ఆడాలని ప్రతి ఒక్క అంతర్జాతీయ ఆటగాడు కోరుకుంటాడు. ఆస్ట్రేలియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్న టాప్ ప్లేయర్స్ భారత టీ20 లీగులో ఆడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్లేయర్స్ మాత్రం ఆడడం లేదు. భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ పాకిస్తాన్ ఆటగాళ్లను అనుమతించడం లేదు. అయితే పాక్ ప్లేయర్స్ కొందరు ఐపీఎల్ ఆడితే భారీ ధర పలుకుతారని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. 

పాకిస్తాన్‌ స్పీడ్‌స్టర్‌ షాహిన్‌ షా ఆఫ్రిదిపై ఆర్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్‌ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడని.. సత్తా ఉన్న బౌలర్‌ అంటూ కొనియాడాడు. ఒకవేళ ఐపీఎల్ వేలంలో ఆఫ్రిది పాల్గొంటే 15 కోట్లకు అమ్ముడుపోయేవాడని యాష్ పేర్కొన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో ఆర్ అశ్విన్ మాట్లాడుతూ... 'పాకిస్తాన్ ఫాస్ట్‌ బౌలర్లు అందరూ గంటకు 140-145 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్‌ చేస్తున్నారు. ప్రపంచంలోని ఏ క్రికెట్‌ జట్టుకు కూడా పేస్‌ బౌలింగ్ ఇంత పటిష్టంగా లేదు. పాక్ జట్టులో ప్రతిభ గల బౌలర్లకు కొదువలేదు' అని అన్నారు. 

'నా బుర్రలో ఎప్పుడూ ఓ క్రేజీ ఆలోచన మెదులుతూనే ఉంటుంది. ఒకవేళ షాహిన్‌ షా ఆఫ్రిది ఐపీఎల్‌ వేలంలో పాల్గొంటే ఎలా ఉంటుంది?.  లెఫ్టార్మ్‌ పేసర్ ఆఫ్రిది కొత్త బంతితో అద్భుతాలు చేయగలడు. అలానే డెత్‌ ఓవర్లలో వరుసగా యార్కర్లు సందించగలడు. అందుకే అతడు ఐపీఎల్ వేలంలోకి వస్తే 15 కోట్లకు కచ్చితంగా అమ్ముడుపోతాడు. ఇక ఆఫ్రిది లేకపోయినా మిగతా బౌలర్లు ఆ లోటును  తీర్చగరు' అని రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చారు. 2008లో జరిగిన టోర్నీ మొదటి ఎడిషన్లో మాత్రమే పాక్ ప్లేయర్స్ పాల్గొన్నారు. 

2018లో పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షాహిన్‌ షా ఆఫ్రిది.. అనతి కాలంలోనే స్టార్ అయ్యాడు. ప్రతి మ్యాచులో వికెట్లు పడగొడుతూ పాక్ జట్టులో కీలక పేసర్‌గా ఎదిగాడు. ఇప్పటివరకు ఆఫ్రిది 25 టెస్టుల్లో 99, 32 వన్డేల్లో 62, 40 టీ20లలో 47 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియాపై పాక్‌ గెలవడంలో ఆఫ్రిది కీలక పాత్ర పోషించాడు. గాయం కారణంగా ఆసియా కప్‌ 2022 టోర్నీకి దూరమైన ఆఫ్రిది.. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. 

Also Read: ఆసియా కప్ 2022 సూపర్ 4 భారత్ షెడ్యూల్ ఇదే.. మరోసారి పాకిస్తాన్‌తో పోరు..!

Also Read: Asia Cup 2022: నాగిని డ్యాన్స్‌ను అదరగొట్టిన లంక ప్లేయర్..వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News