T20 World Cup 2021: క్రికెట్‌ అభిమానులకు పండగే.. ఇక నుంచి మల్టీప్లెక్స్‌లలో టీ20 సందడి..!

T20 World Cup 2021: క్రికెట్ ప్రేమికులను అలరించడానికి టీ -20 ప్రపంచ కప్(T-20 World Cup 2021) సిద్ధమైంది. యూఏఈ, ఒమన్ వేదికగా నేటి నుంచి క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్ లను మల్టీఫెక్స్ లో కూడా వీక్షించవచ్చు. ఈ మేరకు ఐసీసీతో పీవీఆర్ సినిమాస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 04:02 PM IST
T20 World Cup 2021: క్రికెట్‌ అభిమానులకు పండగే.. ఇక నుంచి మల్టీప్లెక్స్‌లలో టీ20 సందడి..!

T20 World Cup 2021: స్టేడియాలకి వెళ్లి మ్యాచ్ చూడలేని క్రికెట్ లవర్స్ (Cricket Lovers)కి గుడ్ న్యూస్. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌(T20 World Cup 2021)లు టీవీల్లోనే కాకుండా సినిమా థియేటర్లలోను ప్రత్యక్షం ప్రసారం కానున్నాయి. ఇన్నాళ్లు, బార్లు, రెస్టారెంట్స్, హోటల్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెద్ద తెరలపైనే మ్యాచ్‌లను ఎంజాయ్ చేసిన అభిమానులు.. ఇక నుంచి థియేటర్లలో ఆ మజాను ఎంజాయ్ చేయనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC)తో మల్టీప్లెక్స్ చైన్ సంస్థలు ఐనాక్స్ లీజర్ లిమిటెడ్, పీవీఆర్ సినిమాస్(PVR Cinemas) ఒప్పందం కుదుర్చుకున్నాయి.

నేటి నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 సందడి మెుదలైంది. 45 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ లో 16 జట్లు పాల్గొంటాయి. టీ 20 ప్రపంచకప్ సందర్భంగా అభిమానులు స్టేడియానికి వెళ్లడానికి అనుమతించారు. అదే సమయంలో భారతదేశంలోని అభిమానులు కూడా మల్టీప్లెక్స్‌లలో మ్యాచ్‌లను తిలకించవచ్చు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా.. అక్టోబర్ 24న భారత్, పాకిస్తాన్ (IND vs PAK) తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. 

Also read:Sourav Ganguly ఐపిఎల్ 2022 గురించి, T20 World Cup 2021 ఏమంటున్నాడంటే..

పీవీఆర్‌, ఐసీసీ ఒప్పందం
మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్‌ సినిమాస్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2021(ICC T20 World cup 2021) క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులను పొందింది. సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో సహా అన్ని భారత మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మ్యాచ్‌లు న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్‌తో సహా 35కి పైగా నగరాల్లోని 75కి పైగా థియేటర్లలో ప్రదర్శిస్తారు.

కరోనా కారణంగా చాలా కాలంగా మూతపడిన థియేటర్లు(Theaters) ఇప్పుడు నెమ్మదిగా తెరుస్తున్నారు. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులకే కాదు చాలా కాలంగా బాధపడుతున్న సినిమా హాళ్లకు కూడా శుభపరిణామం. ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక 100 శాతం ప్రేక్షకుల సామర్థ్యంతో థియేటర్లను ప్రారంభించగా ముంబైలో 50 శాతం మందిని అనుమతించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News