Prithvi Shaw Attack: పృథ్వీ షా కారుపై దాడి.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు!

Indian Cricketer Prithvi shaw attack by Goons in India. టీమిండియా యువ క్రికెటర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 16, 2023, 03:45 PM IST
  • పృథ్వీ షా కారుపై దాడి
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • సెల్ఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో
Prithvi Shaw Attack: పృథ్వీ షా కారుపై దాడి.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు!

Indian Cricketer Prithvi shaw attack by 8 Fans in Mumbai after Refuse To Click Selfies: టీమిండియా యువ క్రికెటర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. రెండోసారి సెల్ఫీ తీసుకునేందుకు పృథ్వీ షా నిరాకరించడంతో.. ఆగ్రహించిన ఫాన్స్ కారుపై దాడి చేశారు. షా తన స్నేహితుడి కారులో కూర్చున్న సమయంలో దాదాపుగా ఓ 8మంది దాడి చేశారని సమాచారం తెలుస్తోంది. షాపై దాడికి సంబంధించి 8 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

క్రికెటర్ పృథ్వీ షా, తన స్నేహితుడు ఆశిష్ యాదవ్‌‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం శాంతా క్రజ్ విమానాశ్రయం సమీపంలోని సహారా స్టార్ హోటల్‌లో విందుకు వెళ్లారు. అక్కడే ఉన్న సనా గిల్, షోబిత్ ఠాకూర్, వారి అనుచరులు పృథ్వీ షాతో సెల్ఫీలు దిగాలని పట్టుబట్టారు. దాంతో షా వారితో కలిసి సెల్ఫీలు దిగాడు. వారు పదే పదే సెల్ఫీలు అడుగుతూ తీవ్ర ఇబ్బంది పెట్టారు. అదే సమయంలో హోటల్‌ మేనేజర్‌ జోక్యం చేసుకుని.. గిల్, ఠాకూర్ సహా అందరినీ హోటల్‌ నుంచి బయటకు పంపించేశారు.

అక్కడితో ఆగని నిందితులు పృథ్వీ షా, ఆశిష్‌ యాదవ్‌తో గొడవకు దిగారు. షా, ఆశిష్‌ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారును వెంబడించారు. బేస్‌బాల్‌ స్టిక్‌తో కారు ముందు, వెనక అద్దాలను పగలగొట్టారు. దాంతో షా, ఆశిష్‌ ఇద్దరు భయపడిపోయారు. ఆపై ముంబై పోలీసులను ఆశిష్‌ ఆశ్రయించాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. 

Also Read: Pakistan Fuel Prices Hike: మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌ ధర రూ.272! లబోదిబోమంటున్న ప్రజలు  

Also Read: Ranji Trophy 2023 Final: చెలరేగిన ఉనద్కత్, చేతన్ సకారియా.. రంజీ ట్రోఫీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన బెంగాల్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook

 

Trending News