Pak vs WI ODIs postponed: పాకిస్థాన్ vs వెస్టిండీస్ వన్డే సిరీస్ వాయిదా.. వణుకు పుట్టిస్తున్న పాజిటివ్ కేసులు

Pak vs WI ODI series postponed: పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య  జరగనున్న వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ మ్యాచులు వాయిదా పడ్డాయి. వెస్టిండీస్ ఆటగాళ్లలో మరో ఐదుగురికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారించడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 10:23 PM IST
Pak vs WI ODIs postponed: పాకిస్థాన్ vs వెస్టిండీస్ వన్డే సిరీస్ వాయిదా.. వణుకు పుట్టిస్తున్న పాజిటివ్ కేసులు

Pak vs WI ODI series postponed: పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య  జరగనున్న వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ మ్యాచులు వాయిదా పడ్డాయి. వెస్టిండీస్ ఆటగాళ్లలో మరో ఐదుగురికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారించడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం వాయిదా పడిన వన్డే సిరీస్ 2022 జూన్‌కి రీషెడ్యూల్ చేశారు. 

వెస్ట్ ఇండీస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు వచ్చినప్పటి నుంచే కరోనావైరస్ కేసులు (Coronavirus cases) వెంటాడుతున్నాయి. వెస్టిండీస్ టీమ్ కరాచిలో కాలు పెట్టినప్పుడే ఆ జట్టుకు చెందిన సపోర్టింగ్ స్టాఫ్‌లో ముగ్గురికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. అయినప్పటికీ ఎలాగోలా ధైర్యంగా ఇప్పటివరకు నెట్టుకొచ్చిన వెస్టిండీస్.. తాజాగా మరో ఐదు కేసులు వెలుగు చూడటంతో ఇక చేతులెత్తేసింది. 

Also read : Brother marries sister: ఎంత దారుణం!! సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

వరుసగా పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో జట్టులోని మిగతా ఆటగాళ్లపై మానసికంగా ఒత్తిడి పెరుగుతుండటంతో పాటు కరోనా వైరస్ కేసులు ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఇరు దేశాల జట్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి తోడు మరోవైపు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు (Omicron cases) కూడా పెరుగుతుండటం మరో కారణమైంది.

Also read : Inter Student Suicide Note: నా చావుకు మంత్రి కేటీఆర్ కారణం.. ట్విట్టర్‌‌లో తెలంగాణ ఇంటర్ విద్యార్థి సూసైడ్ నోట్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News