Kohli vs Afridi: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌పై ప్రశ్నలు సంధించాడు. అదేంటో చూద్దాం.
టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ ప్రపంచంలో బెస్ట్ బ్యాటర్‌గా అందరికీ సుపరిచితం. ఇటీవలి కాలంలో భారీ పరుగులు చేయలేక తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అదే సమయంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇప్పుడు విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి వైఖరిపై ప్రశ్నలు సంధించాడు. బాగా రాణించాలనే ఆసక్తి అతనికుందా లేదా..టైమ్ పాస్ చేస్తున్నాడా అని ప్రశ్నించాడు.
షాహిద్ అఫ్రిది ఏమన్నాడంటే..
క్రికెట్‌లో యాటిట్యూడే సర్వస్వం.అదే నేను ఎప్పుడూ చెబుతుంటాను. క్రికెట్‌పై మీకు ఆ యాటిట్యూట్ ఉందా లేదా..విరాట్ కోహ్లీ కెరీర్ ప్రారంభంలో ప్రపంచంలో నెంబర్‌వన్ బ్యాటర్ కావాలని అనుకునేవాడు. ఇప్పటికీ అదే స్పూర్తితో అతను క్రికెట్ ఆడుతున్నాడా అసలు..ఇదే అతిపెద్ద ప్రశ్న. అతనొక క్లాసిక్ ఆటగాడు. కానీ నెంబర్ 1 కావాలని నిజంగా అతనికుందా..లేదా జీవితంలో అంతా సాధించేశాననుకుంటున్నాడా..లేదా టైమ్ పాస్ చేస్తున్నాడా..అదే అతని యాటిట్యూడ్. అంటూ సమా టీవీతో తెలిపాడు.
2020 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయలేక విరాట్ కోహ్లి విఫలమౌతున్నాడు. అటు హాఫ్ సెంచరీలు కూడా తగ్గిపోయాయి. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ బాలేదు. ఐపీఎల్‌లో రెండు హాఫ్ సెంచరీలు, మూడు డకౌట్‌లు సాధించాడు. విరాట్ కోహ్లీ రీఛార్జ్ అయ్యేందుకు అతనికొక బ్రేక్ అవసరమని..మాజీ టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20 పర్యటనకు దూరంగా ఉన్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ పర్యటనకు హాజరుకానున్నాడు.
Also read: BCCI IPL Rights: అత్యంత ఖరీదుగా మారిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం, ఒక్కొక్క మ్యాచ్ ఖరీదు 118 కోట్లు
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Kohli vs Afridi: కోహ్లీ అంతా సాధించేశాననే ఫీలింగ్‌లో ఉన్నాడా..షాహిద్ అఫ్రిది