Babar Azam Engagement: కరోనా సెకండ్ వేవ్‌లోనూ సెలబ్రిటీల ఇంట పెళ్లిబాజాలు మోగుతున్నాయి. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ముచ్చటగా మూడో వివాహం, వెస్టిండీస్ స్టార్ క్రికెట్ నికోలస్ పూరన్ సైతం తన ప్రేయసిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ జాబితాలో మరో క్రికెటర్ చేరిపోనున్నాడు.
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన మామ కూతురితో ప్రేమలో ఉన్న బాబర్ అజామ్ ఇటీవల నిశ్చితార్థం సైతం చేసుకున్నాడని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పరిస్థితులు చక్కబడితే వచ్చే ఏడాది ఆరంభంలో పాక్ కెప్టెన్ వివాహం ఘనంగా జరగనుందని, అందుకు ఇరు కుటుంబాలు ముహూర్తం నిర్ణయించాయని తెలుస్తోంది. పాకిస్తాన్ (Pakistan) సూపర్ లీగ్ కోసం క్వారంటైన్లో ఉన్నాడు. కరోనా కేసులు రావడంతో ఇటీవల పీఎస్ఎల్ మధ్యలోనే వాయిదా పడటం తెలిసిందే.
Also Read: T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై BCCIకి ఐసీసీ డెడ్‌లైన్
"Babar Azam" is already engaged with his cousin & they will marry next year. Now it's confirmed & amazingly all team members already know it. Congratulations @babarazam258
Credit: @geonews_urdu #BabarAzam pic.twitter.com/0swsHWLKM1— Muhammad Usama (@MUHAMMA11503327) June 1, 2021
పాక్ మాజీ కెప్టెన్ అహర్ అలీ సైతం ప్రస్తుత కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam Marriage) వివాహం చేసుకోవాలని సూచించడంతో పాటు కొన్ని వివరాలు వెల్లడించాడు. పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్ జట్టుకు బాబర్ అజామ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. జూన్ 9 నుంచి పీఎస్ఎల్ సీజన్ తిరిగి ప్రారంభం కానుంది. అయితే అధికారిక మాత్రం రావాల్సి ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి కెరీర్లో అత్యుత్తమంగా నెంబర్ 1 ర్యాంకులో కొనసాగుతున్నాడు.
Also Read: Virat Kohli About Vegan: కోడిగుడ్ల వివాదంపై Team India కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook