Sachin Tendulkar Photo: ఈ ఫొటోలో సచిన్ తో పాటు మరో అతిథి- అదేంటో మీరే కనిపెట్టండి?

Sachin Tendulkar Photo: మాస్టర్ బ్లాస్టర్ సచిన తెందూల్కర్ దిగిన ఈ ఫొటోలో ఓ అనుకోని అతిథి కూడా ఉంది. ఆ అతిథి ఎవరు? ఆ ఫొటోలో ఏముందో మీరు కనిపెట్టగలరా?

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2021, 07:35 PM IST
Sachin Tendulkar Photo: ఈ ఫొటోలో సచిన్ తో పాటు మరో అతిథి- అదేంటో మీరే కనిపెట్టండి?

Sachin Tendulkar Photo: లెజండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ అనే పేరు క్రికెట్ ప్రేమికులకు తెలియనిది కాదు. ఆయన్ని భారతదేశంలో క్రికెట్ దేవుడు అని కూడా అంటారు. సచిన్ కు మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో చాలా మంది క్రికెటర్లు ఉండడం విశేషం. 

16 ఏళ్లకే క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టిన సచిన్ తెందూల్కర్.. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో సెంచరీలు సాధించడం సహా మరెన్నో రికార్డులను నెలకొల్పాడు. అలా ఎన్నో రికార్డులకు నాంది పలికిన ఈ లెజండరీ క్రికెటర్ రిటైర్మెంట్ తర్వాత చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం సహా అనేక ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇటీవల అంతర్జాతీయ పులుల దినోత్సవం (జులై 29) సందర్భంగా సచిన్ తెందూల్కర్ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది భారతదేశంలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్ లో సఫారీకి వెళ్లిన సమయంలో తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేశారు. అయితే ఆ ఫొటోలో అనుకోని అతిథి ఒకటి దాగుంది.

  

సచిన్ షేర్ చేసిన ఫొటోను సరిగా చూస్తే.. దూరంగా ఉన్న గడ్డిలో ఓ పులి దాగుంది. చూస్తుంటే పులి అక్కడ నక్కి కూర్చున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేకంగా గమనిస్తే తప్పా.. ఆ పులి అక్కడ ఉన్నట్లు కనిపించడం లేదు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటో మీరు చూసి.. పులి ఎక్కడుందో కనిపెట్టేయండి.   

 

Also Read: Viral Video : అబ్బో భలే నటిస్తోంది ఈ పాము.. ముట్టుకుంటే చనిపోయినట్లుగా పడిపోతున్న పాము

Also Read: Whatsapp New Feature: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News