కిషోర్ కుమార్ పాట పాడిన సురేష్ రైనా.. వీడియో వైరల్

ప్రస్తుతం నిదహాస్ ట్రోఫీ ముక్కోణపు సిరీస్‌తో బిజీగా వున్న టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా తన తోటి ఆటగాళ్లను అలరించేందుకు పాడిన ఓ పాట ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Last Updated : Mar 12, 2018, 07:59 PM IST
కిషోర్ కుమార్ పాట పాడిన సురేష్ రైనా.. వీడియో వైరల్

ప్రస్తుతం నిదహాస్ ట్రోఫీ ముక్కోణపు సిరీస్‌తో బిజీగా వున్న టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా తన తోటి ఆటగాళ్లను అలరించేందుకు పాడిన ఓ పాట ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సురేష్ రైనాకు మ్యూజిక్ అన్నా, పాటలు పాడటం అన్నా ఎంతిష్టమో అతడి అభిరుచుల గురించి అవగాహన వున్న వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మిరుతియా గ్యాంగ్‌స్టర్స్ సినిమా కోసం " తు మిలి సబ్ మిలి" పాట పాడి బాలీవుడ్‌లోనూ తన లక్ పరీక్షించుకున్నాడు సురేష్ రైనా. ముక్కోణపు సిరీస్ కోసం శ్రీలంకలో వున్న సురేష్ రైనా అక్కడ టీమిండియా క్రికెటర్స్ బస చేసిన హోటల్లో సరదాగా పాడిన పాట అతడి అభిమానులని ఆకట్టుకుంటోంది. సోమవారంనాటి 4వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కన్నా ముందు రోజు సురేష్ రైనా ఈ పాట పాడాడు. 

కటి పతంగ్ సినిమా కోసం ప్రముఖ సింగర్ కిషోర్ కుమార్ పాడిన "యే శామ్ మస్‌తానీ.. మద్‌హోష్ కియే జాయే" పాటను సురేష్ రైనా పాడిన తీరు గురించి చెప్పడం కన్నా ఆ వీడియోనూ చూస్తేనే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మరి! సురేష్ రైనా పాడిన ఆ పాటను మీరూ ఎంజాయ్ చేసేయండి!!

 

Trending News