Devon Conway : టెస్టుల్లో 'కాన్వే' ప్రపంచ రికార్డు... తొలి క్రికెటర్​గా అరుదైన ఘనత!

Devon Conway : తొలి ఐదు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్​ అన్నింటిలోనూ హాఫ్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్​గా కివీస్ ఆటగాడు డేవిడ్ కాన్వే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 02:09 PM IST
Devon Conway : టెస్టుల్లో 'కాన్వే' ప్రపంచ రికార్డు... తొలి క్రికెటర్​గా అరుదైన ఘనత!

NZ vs BAN, 2nd Test: న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవాన్ కాన్వే  (Devon Conway) అరుదైన ఘనత సాధించాడు. ఆడిన మొదటి ఐదు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్​ అన్నింటిలోనూ 50 ప్లస్‌ స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా కాన్వే  ప్రపంచ రికార్ఢు నెలకొల్పాడు.  బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (NZ vs BAN 2nd Test) ఆర్దసెంచరీ సాధించటం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. కాన్వే ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడగా, మొత్తం 5 టెస్టుల్లో 50కు పైగా పరుగులు సాధించాడు. దీంట్లో రెండు సెంచరీలు,  మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

గతేడాది జూన్​లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్​తో (England) జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కాన్వే. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో అద్భుత డబుల్ సెంచరీ (200) చేసి...సంచలనం సృష్టించాడు. తర్వాత ఎడ్జ్​బాస్టన్​ టెస్టులోనూ 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా టెస్టు ఛాంఫియన్​షిప్ ఫైనల్లోనూ భారత్‌పై 54 పరుగులతో కాన్వే కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో అద్భుత సెంచరీ (122)తో మెరిశాడు. ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి 99 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Also Read: Wasim Jaffer - Virat Kohli: కోహ్లీని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. అదిరిపోయే పంచ్ ఇచ్చిన జాఫర్!!

అదరగొట్టిన లాథమ్, కాన్వే
బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో (NZ vs BAN, 2nd Test) టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్​కు ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్​కు వీరిద్దరూ 148 పరుగులు జోడించారు. 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యంగ్ ఔటయ్యాడు. అనంతరం కాన్వే క్రీజులోకి వచ్చాడు. బంగ్లా బౌలర్లపై విరుచుపడుతూ వీరిద్దరూ స్కోర్​బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ వికెట్ నష్టానికి 349 పరుగులు చేసింది. లాథమ్ (186*), కాన్వే (99*) క్రీజులో ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News