Kushal Malla: 34 బంతుల్లో సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డు గోవింద.. గోవిందా..!

ఇప్పటి వరకు టీ20 సీరీస్ లో 35 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ. వీరి రికార్డును నేపాలీ ఆటగాడు కుశాల్‌ ఫాస్టెస్ట్ సెంచరీతో తన పేరిట నమోదు చేసుకున్నాడు. కేవలం 34 బంతుల్లో సెంచరీ చేయటం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2023, 01:20 PM IST
Kushal Malla: 34 బంతుల్లో సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డు గోవింద.. గోవిందా..!

Kushal Malla Breaks the Rohit Sharma's World Record: దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మల పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నేపాలీ ఆటగాడు కుశాల్‌ మల్లా బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మిల్లర్, రోహిత్ శర్మల పేరున ఉండగా.. నేపాలీ ఆటగాడు కుశాల్‌ 34 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా బుధవారం మంగోలియాతో నేపాల్ జట్టు ఆడింది. ఈ మ్యాచ్ లో కుశాల్‌ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 2017 లో మిల్లర్, రోహిత్ శర్మ 35 బంతుల్లో 100 పరుగులు చేశారు. 

ఈ రోజు జరిగిన మ్యాచ్ లో కుశాల్‌ మల్లా మంగోలియాపై కేవలం 50 బంతుల్లో 137 పరుగులు చేశాడు. 50 బంతుల్లో 12 సిక్స్‌లు, 8 ఫోర్లుతో 137 పరుగులు చేయగా.. ఇప్పటి వరకు టీ20 క్రికెట్ ఫార్మాట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేసాడు. ఇది వరకు ఈ రికార్డు మిల్లర్ పేరిట ఉండగా.. మిల్లర్ 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లోనే శతకం కొట్టాడు. అంతేకాకుండా, భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 2017 లో 35 బంతుల్లో రోహిత్ శర్మ శ్రీలంకపై శతకం కొట్టాడు. వీరితో పాటుగా చెక్ రిపబ్లిక్ ఆటగాడు సుదేష్ విక్రమశేఖర 2019లో టర్కీపై 35 బంతుల్లో శతకం బాదాడు.

Also Read: IND Vs AUS Dream11 Team Today Prediction: వరల్డ్‌కప్‌కు ముందు చివరి ఫైట్.. భారత్ వైట్‌వాష్ చేస్తుందా..? డ్రీమ్11 టీమ్, పిచ్ రిపోర్ట్ ఇలా..  

2021 లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగోలియా జట్టును తమ అసోసియేట్ జట్టుగా గుర్తించింది. దీనికి గాను.. మంగోలియా జట్టు నేడు పురుషుల క్రికెట్ లో ఆరంగేట్రం చేసింది. నేపాల్ జట్టు ఆదివారం మాల్దీవులతో రెండో మ్యాచ్ ఆడనుండగా.. గ్రూప్ ‘A’లో ఉన్న నేపాల్ అగ్రస్థానాన్ని చేరుకుంటే క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఆసియా గేమ్స్ 2023లో నేపాల్ జట్టు క్వార్టర్ ఫైనల్‌ చేరితే.. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్లతో నేపాల్ తలపడనుంది. 

Also Read: Most Expensive Currency: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ ఏదో తెలుసా..! డాలర్ కంటే చాలా ఎక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News