క్రితం సంవత్సరమే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించి వ్యాఖ్యాతగా స్థిరపడిన టీమిండియా మాజీ క్రీడాకారుడు మరియు మేటి బౌలర్ ఆశిష్ నెహ్రా ప్రస్తుతం ఇండియన్ బౌలర్లకు కోచింగ్ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి.అయితే టీమిండియాకి అతను కోచ్‌గా వ్యవహరిస్తారా లేక మరేదైనా జూనియర్ జట్టుకి కోచ్‌గా వ్యవహరిస్తాడా అన్నది తెలియదు. ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తమ బౌలర్లకు నెహ్రా చేత కోచింగ్ ఇప్పించడానికి నిర్ణయించుకుంది.38 ఏళ్ల ఆశిష్ నెహ్రా భారత్ తరఫున 17 టెస్టులు, 120 వన్డేలు ఆడి మేటి ఆటగాడిగా కితాబునందుకున్నాడు. ఆయన దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ టీమ్ తరఫున ఆడేవారు. 2016 ఐపీఎల్ ఆక్షన్‌లో సన్ రైజర్స్ జట్టు నెహ్రాను దాదాపు 5.5 కోట్ల రూపాయలకు చేజిక్కించుకోవడం విశేషం.