Rohit Sharma vs MI: ముంబై ఇండియన్స్ జట్టు ఇటీవల బాగా ట్రోల్ అవుతోంది. జట్టు యాజమాన్యంపై నెటిజన్లు, ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ జట్టు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఫలితంగా భారీ మూల్యమే చెల్లించుకునేట్టు కన్పిస్తోంది. ఒకరు కాదు..ఇద్దరు కాదు..వందలు కాదు..వేలు కాదు.. లక్షల్లో ఫాలోవర్లు అన్ ఫాలో అవుతున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టు రధ సారధి రోహిత్ శర్మనే ఇందుకు కారణం. సహజంగా రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక కారణమైతే, ఆ జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించడం మరో కారణం. గత రెండు సీజన్లలో మాత్రమే ముంబై ఇండియన్స్ విఫలమైంది. ఈలోగా ఏం జరిగిందో మరి..ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తెచ్చుకుని, రోహిత్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అతడికి అప్పగించింది. అంతే ఈ నిర్ణయమే ఇప్పుడు భారీగా ట్రోలింగ్‌కు, విమర్శలకు కారణమౌతోంది.
ముంబై ఇండియన్స్ జట్టుది పూర్తిగా తొందరపాటు నిర్ణయమని మండిపడుతున్నారు. రోహిత్ శర్మ లేకుండా ముంబై ఇండియన్స్ జట్టే లేదని కామెంట్లు పెడుతున్నారు. టీమ్ ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కూడా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడం ఆశ్చర్యం కల్గించిందని చెప్పాడు. ఇంత హడావిడిగా రోహిత్ శర్మను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు. ఇది కచ్చితంగా తొందరపాటు నిర్ణయమని చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించే విషయం రోహిత్ శర్మకు చెప్పారా లేదా అని నిలదీస్తున్నారు.
ఇప్పటి వరకూ 9 లక్షలమంది అన్ ఫాలో
ఈ తొందరపాటు నిర్ణయం ఫలితంగా అభిమానుల్లో ఎంత ఆగ్రహం ఉందంటే ఏకంగా 9 లక్షలమంది ఫాలోవర్లు అన్ ఫాలో అయ్యారు. కేవలం ఒక్క రోజులో ఇంత భారీగా అన్ ఫాలో కావడం చిన్న విషయమేం కాదు. ముంబై ఇండియన్స్ జట్టును అన్ ఫాలో చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంబై ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 13.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉంటే ఆ సంఖ్య ఒక్కరోజులో అంటే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన ఒక్క రోజులో 12.7 మిలియన్లకు పడిపోయింది. ఇప్పుడా సంఖ్య 12.3 మిలియన్లకు తగ్గిపోయింది. మరోవైపు సోషల్ మీడియాలో షేమ్ ఆన్ ఎంఐ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook