ధోనీకి షాక్ ఇచ్చిన ట్విటర్.. బ్లూ టిక్ మార్క్ తొలగింపు

Twitter removes blue tick on MS Dhoni twitter account: మహేంద్ర సింగ్ ధోనీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. టీమిండియా మాజీ కెప్టేన్ ధోని అకౌంట్ నుంచి ట్విటర్ బ్లూ టిక్‌ను తొలగించింది. ధోనీ ట్విటర్ ఖాతాలో వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ (Verified blue tick mark) లేకపోవడం చూసి ధోనీ ఫ్యాన్స్, నెటిజెన్స్ రకరకాల సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2021, 05:14 PM IST
ధోనీకి షాక్ ఇచ్చిన ట్విటర్.. బ్లూ టిక్ మార్క్ తొలగింపు

Twitter removes blue tick on MS Dhoni twitter account: మహేంద్ర సింగ్ ధోనీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. టీమిండియా మాజీ కెప్టేన్ ధోని అకౌంట్ నుంచి ట్విటర్ బ్లూ టిక్‌ను తొలగించింది. ధోనీ ట్విటర్ ఖాతాలో వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ (Verified blue tick mark) లేకపోవడం చూసి ధోనీ ఫ్యాన్స్, నెటిజెన్స్ రకరకాల సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే, ట్విటర్ మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

ట్విటర్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఇదే తరహాలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖుల ట్విట్టర్‌ అకౌంట్స్‌పై బ్లూ టిక్ మార్క్‌ను తొలగించడం అప్పట్లో తీవ్ర చర్చనియాంశమైంది. ఆ తర్వాత ట్విటర్ వారి ఖాతాలకు (Twitter accounts) బ్లూ టిక్ మార్కుని పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే, ధోనీకి (MS Dhoni) సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో ఆయన అంతగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ధోనీకి ట్విటర్లో 8.2 మిలియన్ ఫాలోవర్స్, 26 మిలియన్స్‌కిపైగా ఫేస్‌బుక్ ఫాలోవర్స్ (Facebook followers), ఇన్‌స్టాగ్రామ్‌లో 34.5 మిలియన్ల ఫాలోవర్స్ (Instagram followers) ఉన్నారు.

Trending News