Happy BirthDay MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీని ( Mahendra Singh Dhoni ) కెప్టెన్ కూల్ అంటారు. కూల్‌గా టీమ్ ఇండియాను నెంబర్ వన్ ( Team India ) స్థానానికి తీసుకొచ్చాడు. ధోని ఎలాంటి ఉద్రేకాలకు లోనవ్వకుండా వరుస విజయాలతో దూసుకెళ్లాడు .ఈ రోజు మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కెప్టెన్ కూల్ ధోనీకి సెలబ్రీటీల నుంచి డైహార్డ్ ఫ్యాన్స్ వరకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్‌లో ఒక ఫ్యాన్ షేర్ చేసిన యానిమేషన్ వీడియో చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. రవీంద్ర జడేజా ఇందులో బౌలింగ్ చేయగా వరుసగా ధోనీ స్టంపింగ్‌లు చేస్తాడు. అయినా బ్యాట్స్‌మెన్ నిలబడి అంపైర్ వైపు చూస్తుంటాడు. Read Also : Virat Kohli: విరాట్ కోహ్లీ మాత్రమే సచిన్ రికార్డులను బ్రేక్ చేయగలడు
*DHONI REVIEW SYSTEM* 😎#HappyBirthdayMSD ❣️ #Dhoni 🥂 pic.twitter.com/0KBXHqwPCP
— SARC🅰️STIC BOY (@SarcasticKislay) July 7, 2020
అది గమనించిన అంపైర్...అరే నిల్చుని ఏం చేస్తున్నావు. ధోనీ ఔట్ అంటే.. దానర్థం ఔట్ అని. మా థర్ట్ ఎంపైర్ కూడా అతని దగ్గరికి ట్యూషన్ తీసుకోవడానికి వెళ్తాడు. అలాంటిది నువ్వు ధోనీ అప్పీల్‌నే ( Dhoni’s Appeal ) సందేహిస్తున్నావా.. వెళ్లు..ఇంటికి వెళ్లి బిర్యానీ తిను అంటాడు.
ఈ వీడియో సరదాగా అనిపించినా.. ఇందులో ఒక నిజం కూడా ఉంది. ధోనీ వికెట్ కీపింగ్ ( MS Dhoni Wicket Keeping ) చేసే సమయంలో ఎంత మంచి బ్యాట్స్‌మెన్‌కు అయినా కాస్త కంగారుగా ఉంటుంది. ఎందుకంటే మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్ చేసేస్తాడు.2016 లో ఆస్ట్రేలియాతో ( India Vs Australia 2016 ) జరిగిన వన్డేలో జార్జ్ బెయిలీ వికెట్‌ను కేవలం 0.08 సెకన్లలోనే స్టంప్ ఔట్ చేశాడు. ఇదే ఇప్పటి వరకు ఉన్న అత్యంత పాస్టెస్ట్ స్టంపింగ్ ( Fastest Stumping by MS Dhoni ) అదే. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
MS Dhoni: ధోనీ స్టంపింగ్ చేస్తే ఎంపైర్ నిర్ణయంతో పనిలేదు