ఆఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత కోసిన ఇంగ్లండ్ ఆటగాడు మోర్గాన్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఆప్ఘాన్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో అతను 17 సిక్సర్లు బాది వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు.
ఇప్పటి వరకు వన్డేల్లో ఈ స్థాయిలో సిక్సర్లు బాదలేదు..గతంలో రోహిత్ శర్మ, ఏబీ డివిల్లీర్స్, క్రిస్ గేల్ పేరిట 16 సిక్సర్ల రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లండ్ సారధి మోర్గన్ బద్దలు కొట్టేశాడు.
ఇదిలా ఉండగా మోర్గన్ వీర బాదుతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 396 పరుగుల సాధించింది. కాగా మ్యాచ్ లో మోర్గాన్ 71 బంతుల్లో 148 పరుగుల సాధించాడు. దీంతో ఆప్ఘాన్ ముందు కొండత లక్ష్యం పెట్టినట్లయింది.
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
Yep, that's 17 sixes for #EoinMorgan - a new record in ODI cricket 🙌#ENGvAFG #CWC19 https://t.co/DAC5yZYBWA pic.twitter.com/gHSjzeBXMb
— ESPNcricinfo (@ESPNcricinfo) June 18, 2019