Mohammed Siraj missed run out chance and gives 4 Runs in IND vs SA 2nd ODI: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. సఫారీలు నిర్ధేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని మరో 25 బంతులు ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్; 111 బంతుల్లో 15×4), ఇషాన్ కిషన్ (93; 84 బంతుల్లో 4×4, 7×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తన వన్డే కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తన కోటా 10 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ ఇంతబాగా బౌలింగ్ చేసినా.. ఓ పొరబాటు కారణంగా దక్షిణాఫ్రికాకు ఉత్తిపుణ్యాన 4 పరుగులు ఇచ్చాడు.
హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ వేసిన 48వ ఓవర్ రెండో బంతిని దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహరాజ్ ఆడాడు. బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌కు తగిలి వికెట్ల వెనుక ఉన్న కీపర్ సంజూ శాంసన్ చేతిలో పడింది. బంతిని అందుకున్న శాంసన్.. తిరిగి సిరాజ్‌కు విసిరాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్ క్రీజు వెలుపలకి వచ్చాడు. బంతి సిరాజ్ చేతిలో ఉన్నా కూడా మిల్లర్ క్రీజులోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. దాంతో సిరాజ్ బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్ స్టంప్స్ వైపు విసిరేశాడు. బంతి వికెట్లను తాకలేదు. ఇక మిడాన్‌లో ఫీల్డర్ ఎవరూ లేకపోవడంతో నేరుగా బౌండరీకి వెళ్ళింది.
Mohammad Siraj missed the stump by just 1 mile🤣🤣pic.twitter.com/8mtS1gX9eo
— Cric (@CricLavdeep4518) October 9, 2022
మహ్మద్ సిరాజ్ తప్పిదం కారణంగా దక్షిణాఫ్రికాకు బైస్ రూపంలో అదనంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఈ ఘటనతో టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ అసంతృప్తికి గురయ్యాడు. సిరాజ్ కూడా బౌండరీ వెళ్లిందని నిరాశ వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ధావన్, సిరాజ్ కలిసి అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై భారత అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. సిరాజా ఎంత పని జేస్తివి, ఔట్ చేయకపోగా బౌండరీ ఇచ్చావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరు ఓ లుక్కేయండి.
Also Read: అనంతపద్మనాభ స్వామి కోనేరు మొసలి మృతి.. నివాళులర్పించేందుకు తరలివచ్చిన జనం!
Also Read: Nayanthara Surrogacy : సరోగసి ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్ట్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Mohammed Siraj Throw: సిరాజా ఎంత పని జేస్తివి.. ఔట్ చేయకపోగా బౌండరీ ఇస్తివిగా (వీడియ
సిరాజా ఎంత పని జేస్తివి
ఔట్ చేయకపోగా బౌండరీ ఇస్తివిగా
ఉత్తిపుణ్యాన 4 పరుగులు