ప్లీజ్.. షమిని ఐపీఎల్ నుంచి తప్పించండి

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్‌ షమి భార్య హసీన్‌ జహాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సీఈవో హేమంత్‌ దువాను కలిశారు.

Last Updated : Apr 1, 2018, 04:43 PM IST
ప్లీజ్.. షమిని ఐపీఎల్ నుంచి తప్పించండి

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్‌ షమి భార్య హసీన్‌ జహాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సీఈవో హేమంత్‌ దువాను కలిశారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ నుంచి షమిని ఆడించకూడదని కోరారు. ఈ విషయాన్ని హసీన్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘హేమంత్‌ సార్‌కు షమి వల్ల నేను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పాను. నాకు న్యాయం జరిగేవరకూ అతన్ని ఐపీఎల్‌ నుంచి తప్పించాల్సిందిగా కోరాను.’ అని తెలిపారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌, ఇతర మహిళలతో సంబంధాలు, హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ హసీన్‌ జహాన్‌ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినా.. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం షమి ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని క్లీన్‌చిట్ ఇచ్చింది. బీసీసీఐ ‘బి’ గ్రేడ్‌ కాంట్రాక్టులో చోటు కల్పించింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది.  ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్ తరఫున షమి ఆడుతున్నాడు.వేలంలో ఢిల్లీ  డేర్‌డెవిల్స్‌ టీం షమిని రూ.3 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.  

అయితే దీనిపై ఢిల్లీ టీమ్ ఎలా స్పందించిందన్న దానిపై స్పష్టత లేదు. అటు సాయం కోసం హసీన్‌ బీసీసీఐని ఆశ్రయించగా.. ఇది వ్యక్తిగత విషయమని, మీరే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని ఆమెకు సూచించినట్లు బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు ఖన్నా తెలిపారు.  షమి ఇండియన్ టీమ్‌లో ఉన్నాడు. అతడు ఐపీఎల్‌తోపాటు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ బాగా ఆడాలని కోరుకుంటున్నామన్నారు.  

Trending News