క్రికెటర్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన భార్య

భారత క్రికెటర్ వివాదంలో ఇరుక్కున్నాడు.

Last Updated : Mar 7, 2018, 01:57 PM IST
క్రికెటర్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన భార్య

భారత క్రికెటర్ మహ్మద్ షమీ వివాదంలో ఇరుక్కున్నాడు. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని షమీ భార్య హసిన్ జహన్ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన మెసేజ్‌లను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. షమీ, అతని కుటుంబ సభ్యులు రెండేళ్ల నుంచి వేధిస్తున్నారని.. చంపేందుకు కూడా వెనుకాడటం లేదని ఆమె అన్నారు. షమీపై, అతని కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు హసిన్ సిద్ధమవుతోంది. బౌలర్ షమీకి,హసిన్ జహన్‌కు 2014లో వివాహమైంది.
 
తన కుటుంబం, పాప కోసం ఇన్నేళ్ళు వేచి చూశానని, కానీ షమీలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనవద్ద ఉన్న ఆధారాలతో షమీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. కాగా, తన గురించి వస్తున్న వార్తలను షమీ కొట్టిపారేశాడు. అవన్నీ అవాస్తవాలని చెప్పాడు. ఇదంతా ఎవరో గిట్టని వాళ్లే చేస్తున్నారని షమీ చెప్పాడు. ఆటపై దృష్టి సారించకుండా కెరీర్ ను నాశనం చేయాలనే ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని షమీ పేర్కొన్నాడు.

 

Trending News