MI vs CSK: చివరి ఓవర్లో గర్జించిన ధోనీ.. చెన్నై అద్భుత విజయం! వరుసగా ఏడో మ్యాచ్ ఓడిన ముంబై

MI vs CSK, IPL 2022: MS Dhoni blitz helps CSK pull off thriller. ఐపీఎల్ 15వ సీజ‌న్‌లో భాగంగా గురువారం రాత్రి డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ముంబై ఇండియ‌న్స్ జట్టుతో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 11:58 PM IST
  • చివరి ఓవర్లో గర్జించిన ధోనీ
  • చెన్నై అద్భుత విజయం
  • వరుసగా ఏడో మ్యాచ్ ఓడిన ముంబై
MI vs CSK: చివరి ఓవర్లో గర్జించిన ధోనీ.. చెన్నై అద్భుత విజయం! వరుసగా ఏడో మ్యాచ్ ఓడిన ముంబై

MI vs CSK IPL 2022: MS Dhoni 28, Dwaine Pretorius 22 runs helps Chennai beat Mumbai: ఐపీఎల్ 15వ సీజ‌న్‌లో భాగంగా గురువారం రాత్రి డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ముంబై ఇండియ‌న్స్ జట్టుతో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది. ముంబై నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఊహించని విజయాన్ని అందుకుంది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (28; 13 బంతుల్లో 3x4, 1x6) చివరి ఓవర్లో తన మార్క్ ఆట ఆడాడు. అంబటి రాయుడు (40; 35 బంతుల్లో 2x4, 3x6), రాబిన్ ఉతప్ప (30; 25 బంతుల్లో 2x4, 2x6) టాప్ స్కోరర్లు. ముంబై బౌలర్ డేనియల్ సామ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. తొలి బంతికే ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ (0) డానియల్‌ సామ్స్ బౌలింగ్‌లో తిలక్ వర్మ చేతికి క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. కాసేపటికే మిచెల్ సాట్నర్ (11) ఔటయ్యాడు. ఈ సమయంలో అంబటి రాయుడు, రాబిన్‌ ఉతప్పలు జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. అయితే 9వ ఓవర్లో ఉతప్ప ఔట్ అవ్వడంతో చెన్నై మరోసారి కష్టాల్లో పడింది. 

శివమ్ దూబే (), రవీంద్ర జడేజా ఔట్ అవ్వడంతో చెన్నై మ్యాచ్ కోల్పేయేలా కనిపించింది. అయితే ప్రిటోరియస్‌ (22) రాణించడంతో చెన్నై మళ్లీ రేసులోకి వచ్చింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. మొదటి బంతికే ప్రిటోరియస్‌ ఔట్ అయ్యాడు. అయితే క్రీజులో ఎంఎస్ ధోనీ ఉండంతో చెన్నై విజయంపై నమ్మకంగా ఉంది. అందరూ ఊహించినట్టే ధోనీ ఒక సిక్స్‌, రెండు ఫోర్లు బాది చెన్నైకి విజయాన్ని అందించాడు. దాంతో ఐపీఎల్ 2022లో జడేజా సేన రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బోణీ కొట్టాలని భావించిన ముంబైకి మళ్లీ నిరాశే మిగిలింది. వరుసగా ఏడో మ్యాచ్ ఓడింది. 

అంతకుముందు ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో ఏడు వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. తెలుగు ఆటగాడు తిల‌క్ వ‌ర్మ (51; 43 బంతుల్లో 3x4, 2x6) హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ (32; 21 బంతుల్లో 3x4, 1x6), హృతిక్ షోకిన్ (25; 25 బంతుల్లో 3x4, 1x6) ఫ‌ర్వాలేద‌నిపించాడు. స్టార్ ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ డ‌కౌట్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముఖేష్ చౌదరి మూడు వికెట్లు పడగొట్టగా.. డ్వేన్ బ్రావో 2 వికెట్లు తీశాడు. 

Also Read: Neha Malik: జిమ్‌లో నేహా మాలిక్.. అమ్మడి అందాలు చూడతరమా!

Also Read: Neha Shetty: బ్లూ సారీలో నేహా శెట్టి.. డీజే టిల్లు భామ‌ అందాలకు ఫిదా అవ్వాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News