హామిల్టన్ వేదికగా భారత్‌తో బుధవారం జరగనున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ టాస్ నెగ్గింది. కివీస్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇద్దరు భారత క్రికెటర్లకు మాత్రం ఈ మ్యాచ్ మరిచిపోలేని రోజు. భారత్ వన్డే జట్టులోకి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ అరంగేట్రం చేశారు. టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరికి క్యాప్ అందజేశాడు. మయాంక్ అగర్వాల్ క్యాప్ నెంబర్ 230 అందుకోగా, పృథ్వీ షా 231వ వన్డే ఆటగాడిగా కోహ్లీ చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. కివీస్, భారత్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ నేడు ప్రారంభం అవుతుంది.
ఇటీవల జరిగిన టీ0 సిరీస్‌ను 5-0తో భారత్ క్వీన్ స్వీప్ చేయడం తెలిసిందే. ఎంత ప్రయత్నించినా ఆతిథ్య కివీస్ జట్టు సొంతగడ్డపై దారుణ పరాభవానికి లోనైంది. వన్డే సిరీస్‌లోనైనా పరువు దక్కించుకోవాలని కివీస్ భావిస్తోంది. అయితే ఇరుజట్లను గాయాలు వెంటాడుతున్నాయి. భారత రెగ్యూలర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గాయాలపాలు కావడంతో మాయంక్ అగర్వాల్, పృథ్వీ షాలకు అవకాశం దక్కింది. వ
టీమిండియా లక్కీ క్రికెటర్ మనీశ్ పాండేతో పాటు ట20 సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఆల్‌రౌండర్ శివమ్ దూబేని జట్టు నుంచి తప్పించారు. సీనియర్ ప్లేయర్, ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌కి తుది జట్టులో ఛాన్స్ లభించింది. టీ20 సిరీస్‌లో అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారించిన కేఎల్ రాహుల్‌ని వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం గమనార్హం.