Anrich Nortje: అన్రిచ్ నోర్జ్‌ను బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు.. కారణం ఏంటో తెలుసా?

Anrich Nortje ruled out from LSG vs DC Match. ఢిల్లీ పేసర్‌ అన్రిచ్ నోర్జ్‌ను బౌలింగ్‌ వేయకుండా అంపైర్లు ఆదుకున్నారు. వరుస ఓవర్లలో రెండు బీమర్లు సంధించడంతోనే అతడిని మద్దనం ఉంచి బయటికి పంపించేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 01:04 PM IST
  • నేరుగా డికాక్‌ మీదకు
  • నోర్జ్‌ను బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు
  • 2.2 ఓవర్లు.. 35 పరుగులు
Anrich Nortje: అన్రిచ్ నోర్జ్‌ను బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు.. కారణం ఏంటో తెలుసా?

Delhi pacer Anrich Nortje ruled out of the attack for bowling two beamers in Lucknow Match: శుక్రవారం రాత్రి డివై పాటిల్ స్పోర్ట్స్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అద్బుత విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. అనంతరం  19.4 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసిన లక్నో టోర్నీలో హ్యాట్రిక్ విజయం అందుకుంది. అయితే ఈ మ్యాచులో ఢిల్లీ పేసర్‌ అన్రిచ్ నోర్జ్‌ను బౌలింగ్‌ వేయకుండా అంపైర్లు ఆదుకున్నారు. వరుస ఓవర్లలో రెండు బీమర్లు సంధించడంతోనే అతడిని మద్దనం ఉంచి బయటికి పంపించేశారు. 

చేధనలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 13 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. అప్పటికి  క్వింటన్ డికాక్‌ (53) హాఫ్ సెంచరీ చేయగా.. దీపక్‌ హుడా (4) అప్పుడే క్రీజులోకి వచ్చాడు. 14వ ఓవర్‌ బౌలింగ్‌ చేసేందుకు వచ్చిన అన్రిచ్ నోర్జ్‌.. తొలి బంతిని నేరుగా డికాక్‌ మీదకు విసిరాడు. ఆ బంతిని దక్షిణాఫ్రికా ఆటగాడు సిక్సర్‌గా మలిచాడు. అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఇక 16వ ఓవర్‌ బౌలింగ్‌ చేసేందుకు వచ్చిన నోర్జ్‌.. మూడో బంతిని హుడా పైకి విసిరాడు. ఆ బంతిని హుడా ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా షాట్‌ ఆడగా.. పృథ్వీ షా క్యాచ్‌ అందుకున్నాడు.

దీపక్‌ హుడాకు వేసిన బంతిని కూడా అంపైర్లు బీమర్‌గా ప్రకటించారు. దాంతో ఢిల్లీ పేసర్‌ అన్రిచ్ నోర్జ్‌ను అంపైర్లు మ్యాచ్ నుంచి సస్పెండ్‌ చేశారు. క్రికెట్‌ నియమాల ప్రకారం.. ఎవరైనా బౌలర్‌ ఒకే మ్యాచ్‌లో రెండు బీమర్లు (బ్యాట్స్‌మన్‌ నడము పైభాగంపైకి నేరుగా బంతిని విసరడం) సంధిస్తే అతడిని వెంటనే గేమ్‌ నుంచి సస్పెండ్‌ చేస్తారు. నోర్జ్‌ కూడా రెండు బీమర్లు సందించడంతోనే మ్యాచ్‌ నుంచి తప్పించారు. 

లక్నోతో జరిగిన మ్యాచులో అన్రిచ్ నోర్జ్‌ మొత్తంగా 2.2 ఓవర్లే బౌలింగ్‌ చేసిన 35 పరుగులు ఇచ్చాడు. 16వ ఓవర్‌లో మిగిలిన మూడు బంతులను వేసిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. ఆ ఓవర్లో కుల్దీప్ రెండు బౌండరీలిచ్చి క్వింటన్ డికాక్‌ (80) వికెట్‌ పడగొట్టాడు. డికాక్‌ ఔట్ అయినా.. ఆయుష్‌ బదోని (10 నాటౌట్‌), కృనాల్‌ పాండ్యా (19నాటౌట్‌) రెచ్చిపోయాడంతో లక్నో మరో రెండు బంతులు ఉండగానే విజయం సాధించింది. 

Also Read: Ghani Movie Review: గని మూవీ ఎలా ఉంది? వరుణ్ తేజ్ హిట్టు కొట్టాడా?

Also Read: OnePlus new TV: మార్కెట్లోకి వన్​ప్లస్ కొత్త స్మార్ట్​టీవీ- ధర, ఫీచర్ల ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News