ఆలౌట్..
ఇంగ్లాండ్ అండర్ 19 జట్టు.. 189 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రాజ్ భవ వేసిన 45వ ఓవర్ 5వ బంతికి జోషువా బాయ్డెన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ క్యాచ్‌ను కూడా దినేష్ బానల్ పట్టాడు.
దీనితో ఇండియా లక్ష్యం 190 పరుగులుగా ఉంది.
ఎవరెవరు ఎంత స్కోర్ చేశారంటే..
జేమ్స్ రూ అత్యధికంగా 116 బంతుల్లో 95 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
ఆ తర్వాతి స్థానంలో జేమ్స్ సేల్స్ ఉన్నాడు. సేల్స్ 65 బంతులు ఆడి 34 రన్స్ కొట్టాడు.
జార్జ్ థామస్ 30 బంతుల్లో 27 పరుగులకు అవుటయ్యాడు.
ఆ తర్వాత రెహాన్ అహ్మద్ 10 (21), అలెక్స్ హార్టన్ (కీపర్) 10 (21), జాకబ్ బేతెల్ 2 (5), జోషువా బాయిడెన్ 1 (5) రన్స్ చేశారు.
ఇక టీమ్ కెప్టెన్్ నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. జార్జ్ బెల్, థామస్ అస్పిన్వెల్లు కూడా ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగారు.
ఇక బౌలర్ల విషయానికొస్తే..
రాజ్ భవ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. రాజ్ కుమార్ 4 వికెట్లను పడగొట్టాడు. కౌషల్ తంబే ఒక వికెట్ తీశాడు.