లియం ప్లంకెట్ మరోసారి కివీస్ బ్యాట్స్మేన్పై విరుచుకుపడ్డాడు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసిసి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్లంకెట్ చెలరేగిపోయాడు. కేన్ విలియమ్సన్ (30), హెన్రీ నికోల్స్( 55) వంటి రెండు కీలకమైన వికెట్స్ తీసి కివీస్‌ను కష్టాల్లోకి నెట్టిన ప్లంకెట్.. ఈసారి జిమ్మి నీశమ్‌ను(19) పరుగులకే ఔట్ చేసి న్యూజిలాండ్ నడ్డి విరిచాడు. దీంతో 39 ఓవర్లలో 173 పరుగులకే కివీస్ 5 వికెట్లు కోల్పోయినట్లయింది.
ఇంగ్లండ్ బౌలర్స్ ధాటికి ఎక్కువగా సింగిల్స్, అప్పుడప్పుడు డబుల్స్‌తోనే నెట్టుకొస్తున్న కివీస్ బ్యాట్స్‌మేన్.. వేగంగా భారీ స్కోర్ రాబట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.