All England Open 2022: ఫైనల్లో లక్ష్యసేన్ ఓటమి.. ఆల్‌ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌ విజేత అక్సెల్సెన్‌!!

Lakshya Sen Loses To Viktor Axelsen In All England Open 2022. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విక్టర్ అక్సెల్సెన్  21-10, 21-15తో వరుస గేమ్స్‌లో లక్ష్యసేన్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 10:33 AM IST
  • లక్ష్యసేన్ కల చెదిరింది
  • ఫైనల్లో లక్ష్యసేన్ ఓటమి
  • ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌ విజేత అక్సెల్సెన్‌
All England Open 2022: ఫైనల్లో లక్ష్యసేన్ ఓటమి.. ఆల్‌ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌ విజేత అక్సెల్సెన్‌!!

Lakshya Sen Loses To Viktor Axelsen In All England Open 2022: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో మూడో టైటిల్ గెలవాలన్న భారత్ రెండు దశాబ్దాల కల చెదిరింది. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ తుది మెట్టుపై బోల్తా కొట్టాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన లక్ష్యసేన్.. టైటిల్ ఫైట్‌లో వరల్డ్ నంబర్ వన్ విక్టర్ అక్సెల్సెన్ దూకుడు ముందు తేలిపోయాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విక్టర్ 21-10, 21-15తో వరుస గేమ్స్‌లో లక్ష్యసేన్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. దాంతో యువ భారత ఆటగాడు రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. 

తొలి గేమ్‌ ఆదిలోనే 0-6తో వెనుకబడిన లక్ష్యసేన్ ఆ తర్వాత పుంజుకోలేకపోయాడు. విరామ సమయానికి 11-2తో ఉన్న అక్సెల్సెన్‌.. అదే ఊపులో తొలి గేమ్‌ను 21-10తో ఖాతాలో వేసుకున్నాడు. రెండో గేమ్‌ ఆరంభంలో లక్ష్య 4-4తో దూసుకు ప్రదర్శించాడు. పుంజుకున్న అక్సెల్సెన్‌ విరామానికి 11-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఓ దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన లక్ష్య.. ప్రత్యర్థిని కాస్త ఒత్తిడికి గురిచేశాడు. కానీ ఆ పోరాటం సరిపోలేదు. అక్సెల్సెన్‌ అలవోకగా 21-15తో రెండు గేమ్ గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయాడు. 

విక్టర్ అక్సెల్సెన్‌ ఆల్‌ ఇంగ్లండ్ టైటిల్‌ గెలవడం ఇది రెండోసారి. టోర్నీ ఆసాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అక్సెల్సెన్‌.. ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ను చేజిక్కించుకోవడం విశేషం. వరుసగా నాలుగో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టడం కూడా ఇంకో విశేషం. ఇక అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు వచ్చిన లక్ష్యసేన్.. 53 నిముషాలు జరిగిన టైటిల్ ఫైట్‌లో ఒత్తిడిని జయించలేకపోయాడు. దాంతో ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలనుకున్న లక్ష్యసేన్ కల చెదిరింది. 

జపాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ అకానె యమగూచి మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో  21-15, 21-15తో ఆన్‌ సియంగ్‌ (దక్షిణ కొరియా)ను ఓడించింది. మరోవైపు మహిళల డబుల్స్‌లో సెమీస్‌ చేరిన గాయత్రి గోపీచంద్‌ పుల్లెల-ట్రీసా జాలీ జోడీ ఫైనల్‌ మాత్రం చేరలేకపోయింది. సెమీస్‌లో 17-21, 16-21తో జాంగ్‌ షియాన్‌-జాంగ్‌ యు (చైనా)ల చేతుల్లో భారత్ జోడి ఓడింది.

Also Read: Today Gold and Silver Price: నిలకడగా పసిడి ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి!!

Also Read: Tim Southee: ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక.. ప్రేయసిని పెళ్లాడిన స్టార్ క్రికెటర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News