KL Rahul Wedding: హీరోయిన్ ను పెళ్లాడబోతున్న రాహుల్.. ధోనీ, షారుఖ్ సహా పెళ్లి అతిధుల లిస్టు ఇదే!

KL Rahul Athiya Wedding: ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్ బ్యాట్స్‌మెన్ లోకేష్ రాహుల్ పెళ్లిపై కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నా ఈసారి ఈ నెలలో మాత్రం ఆయన నిజంగానే ఏడడుగులు వేయబోతున్నాడు అని అంటున్నారు. ఆ వివరాలు

Last Updated : Jan 12, 2023, 08:54 PM IST
KL Rahul Wedding: హీరోయిన్ ను పెళ్లాడబోతున్న రాహుల్.. ధోనీ, షారుఖ్ సహా పెళ్లి అతిధుల లిస్టు ఇదే!

KL Rahul Athiya Wedding: ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్ బ్యాట్స్‌మెన్ లోకేష్ రాహుల్ పెళ్లిపై కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నా ఇప్పటివరకు అందుకు సంబంధించిన అధికారిక క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు తాజాగా లోకేష్ రాహుల్ -అతియా శెట్టి ఈ నెలలో వివాహం చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడు లోకేష్ రాహుల్, అతియా పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు తెరమీదకు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, వారిద్దరూ జనవరి 23న వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ పెళ్లి కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుండగా  మొదటి రెండు రోజులలో హల్దీ, గోరింట, సంగీత్ వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక మూడో రోజు ఇద్దరూ ఏడడుగులు వేయనున్నారు. మహారాష్ట్ర ఖండాలాలోని సునీల్ శెట్టి బంగ్లాలో ఈ వివాహం జరగనుంది. జనవరి 21 నుండి జనవరి 23 వరకు జరగనున్న వివాహానికి ఎంపికైన అతిథులు మాత్రమే హాజరవనున్నారు. ఇక ఈ పెళ్లి అతిథి జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నారని అంటున్నారు.

వీరి వివాహానికి ధోనీ, కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షర్ కుమార్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. రాహుల్, అతియా చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరి గురించి సునీల్ శెట్టి కూడా ఓపెన్ గా మాట్లాడాడు. ఇక పెళ్లి తర్వాత లోకేష్ రాహుల్, అతియా శెట్టి బాంద్రాలో నివాసం ఉండనున్నారు.

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అలియా భట్ ఇంటికి సమీపంలోని అతియా-రాహుల్ ఇల్లు ఉంటుంది.  ఇది క్రికెట్ విషాయానికి వస్తే లోకేష్ రాహుల్ ప్రస్తుతం బ్యాడ్ ఫామ్ తో సతమతమవుతున్నాడు. టీ20తో పాటు వన్డేల్లోనూ అతని బ్యాట్‌ నుంచి పరుగులు రాలేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పిస్తారనే చర్చ సాగుతోంది.  
Also Read: Vijay Craze: తెలుగు రిలీజ్ లేకున్నా విజయ్ జోరు.. 'తునివు'ని వెనక్కు నెట్టి మరీ!

Also Read: Buddha Venkanna Counter : వర్మకు విషయం లేదా.. బుద్దా వెంకన్న అంత మాట అనేశాడు ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News