Andre Russell: ఇవెక్కడి షాట్లు రా అయ్యా.. ఊచకోత కోసిన రస్సెల్.. ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ టార్గెట్

KKR vs SRH Score Updates: ఎస్‌ఆర్‌హెచ్‌పై ఆండ్రీ రస్సెల్ రఫ్ఫాడించాడు. గత సీజన్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయిన రస్సెల్.. ఈసారి తొలి మ్యాచ్‌ నుంచే ఊచకోత మొదలుపెట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కోతా 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 23, 2024, 10:11 PM IST
Andre Russell: ఇవెక్కడి షాట్లు రా అయ్యా.. ఊచకోత కోసిన రస్సెల్.. ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ టార్గెట్

KKR vs SRH Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలింగ్‌ను కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రస్సెల్ ఊచకోత కోశాడు. బాల్ పడితే బౌండరీ తరలించడమే లక్ష్యంగా వీరవిహారం చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలో సన్‌రైజర్స్ వరుస వికెట్లు తీసి పట్టు బిగించినట్లే కనిపించినా.. ఆ తర్వాత కేకేఆర్ బ్యాట్స్‌మెన్ రఫ్పాడించారు. రస్సెల్ (64 నాటౌట్)కు తోడు సాల్ట్ (54), రమణ్‌దీప్ సింగ్ (35), రింకూ సింగ్ (23) ఎదురుదాడికి దిగారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో నటరాజ్ మూడు వికెట్లు తీయగా.. మయాంక్ మార్కండే 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు. 209 పరుగుల భారీ లక్ష్యంతో హైదరాబాద్ బరిలోకి దిగనుంది.

Also Read: PBKS Vs DC Highlights: పంత్ రీఎంట్రీ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి.. సొంతగడ్డపై రెచ్చిపోయిన పంజాబ్    

టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సొంతగడ్డపై మొదట బ్యాటింగ్ ఆరంభించిన కేకేఆర్‌కు ఆరంభంలోనే వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్ (2) రనౌట్ అవ్వగా.. వెంకటేశ్ అయ్యర్ (7) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా డకౌట్ అవ్వడంతో కేకేఆర్ కష్టాల్లో పడింది. కాసేటికే నితీశ్ రాణా (9) కూడా తక్కువ స్కోరుకే ఔట్ అవ్వడంతో 7.3 ఓవర్లలోనే 51 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.  

అప్పటికే క్రీజ్‌లో ఓపెనర్ ఫిన్ సాల్ట్ కుదురుకోగా.. రమణ్‌దీప్‌ సింగ్ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించాడు. 17 బంతుల్లోనే ఒక ఫోర్, 4 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. కాసేపటికే ఫిన్ సాల్ట్ (40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔట్ అవ్వగా.. భారీ స్కోరు కష్టమేననిపించింది. అయితే ఆండ్రీ రసెల్, రింకూ సింగ్ క్రీజ్‌లోకి రాకతో పరుగుల్లో వేగం పుంజుకుంది. ముఖ్యంగా రస్సెల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. చివరి వరకు అదే జోరును కంటిన్యూ చేస్తూ.. 25 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. రింకూ సింగ్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 

Also Read:  V Hanumanth Rao: రేవంత్ రెడ్డి రెండు సైడ్ లు వినాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ.హనుమంత రావు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News