రాజస్థాన్ రాయల్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ గెలుపు.. మెరిసిన కేఎల్ రాహుల్

రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇండోర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది

Last Updated : May 7, 2018, 12:52 AM IST
రాజస్థాన్ రాయల్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ గెలుపు.. మెరిసిన కేఎల్ రాహుల్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇండోర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫీల్డింగ్‌కే మొగ్గు చూపడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌కి దిగింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 152 పరుగులు చేయగలిగింది. జాస్‌ బట్లర్ 51 పరుగులు (39 బంతుల్లో 4X7) తనదైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా సంజూ శాంసన్‌ 28 పరుగులు (23 బంతుల్లో 4X2, 6X1‌), శ్రేయాస్‌ గోపాల్ ‌(24‌)లు స్కోర్ పెంచడంలో తమ వంతు పాత్ర పోషించారు. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్‌కి దిగిన కాసేపపట్లోనే బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ విసిరిన తొలి ఓవర్ మూడవ బంతికే డీ ఆర్సీ షార్ట్ ‌(2) రూపంలో ఆ జట్టు ఫస్ట్ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం డి ఆర్సీ షార్ట్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రహానే సైతం 5 పరుగులకే వికెట్ కోల్పోయాడు. అక్సర్ పటేల్ విసిరివ బంతిని రహానే హిట్ ఇవ్వగా క్రిస్ గేల్ ఆ షాట్‌ని ఒడిసిపట్టుకుని రహానేని పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 4 ఓవర్లు కూడా పూర్తి కాకముందే రాజస్తాన్‌ జట్టు రెండు కీలకమైన వికెట్లను పోగొట్టుకుంది. అలా ఒక్కో వికెట్‌ని కోల్పోతూనే రాజస్థాన్ జట్టు 152 పరుగులు చేసింది. 

రాజస్థాన్ రాయల్స్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్ కేవలం 18.4 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో ఛేదించింది. వరుసగా రెండు ఓటముల తర్వాత కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ జట్టుకు దక్కిన విజయం ఇది. పంజాబ్ జట్టు విజయంలో కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్) 84 పరుగులతో (54 బంతుల్లో 4X7,  3X6) కీలక పాత్ర పోషించగా కరుణ్‌ నాయర్‌(31) తన పర్‌ఫార్మెన్స్‌తో అలరించాడు.

Trending News