KGF Chapter 2: జతకట్టిన కేజీఎఫ్-ఆర్‌సీబీ.. చాఫ్టర్ 2 ముందే వచ్చింది! ఒకే ఫ్రెమ్‌లో యష్, కోహ్లీ

KGF 2 Hombale Films Ties Up With Royal Challengers Bangalore. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జతకట్టినట్టు హొంబలె ఫిల్మ్స్‌ ఈ రోజు ఉదయం ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 04:03 PM IST
  • జతకట్టిన కేజీఎఫ్-ఆర్‌సీబీ
  • చాఫ్టర్ 2 ముందే వచ్చింది
  • ఒకే ఫ్రెమ్‌లో యష్, కోహ్లీ
KGF Chapter 2: జతకట్టిన కేజీఎఫ్-ఆర్‌సీబీ.. చాఫ్టర్ 2 ముందే వచ్చింది! ఒకే ఫ్రెమ్‌లో యష్, కోహ్లీ

KGF 2 Hombale Films Ties Up With IPL Team Royal Challengers Bangalore: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన శాండిల్‌వుడ్‌ సినిమా 'కేజీఎఫ్‌' బాక్సాఫీక్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టిచిందో అందరికి తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో కన్నడ హీరో 'యశ్‌' పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న కేజీఎఫ్‌ 2 విడుదల కోసం సీనీ ప్రేమికులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కేజీఎఫ్‌ సినిమాను నిర్మించిన హొంబలె ఫిల్మ్స్‌.. సినిమా విడుదలకు ముందే చాఫ్టర్ 2ని చూపించేసింది. 

శాండిల్‌వుడ్‌లో టాప్ మూవీ ప్రొడక్షన్ హౌస్ అయిన హొంబలె ఫిల్మ్స్‌.. 'బిగ్ అనౌన్స్మెంట్' అంటూ శనివారం ఓ పోస్టర్ వదిలిన విషయం తెలిసిందే. 'టూ గ్రేట్ డ్రీమ్స్.. బోర్న్ ఇన్ బెంగళూర్ టు థ్రిల్ ద నేషన్' అంటూ రాసుకొచ్చింది. చెప్పిన విధంగానే హొంబలె ఫిల్మ్స్‌ కన్నడ ప్రజలకు అదిరిపోయే న్యూస్ అందించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జతకట్టినట్టు హొంబలె ఫిల్మ్స్‌ ఈ రోజు ఉదయం ప్రకటించింది. ఈ రెండు సంస్థలు కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తాము జతకడుతున్నట్టు ఓ వీడియో రూపంలో హొంబలె ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ తెలిపింది. ఒక నిమిషం 23 సెకెండ్ల నిడివి గల వీడియోయూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ 2 యాక్టర్స్, ఆర్‌సీబీ ప్లేయర్లను మిక్స్ చేసి చూపించారు. సంజయ్ దత్, ఫాఫ్ డుప్లెసిస్, రవీనా టండన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యష్, విరాట్ కోహ్లీల కాంబినేషన్‌ను ఇందులో అద్భుతంగా మిక్స్ చేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. చివరలో కోహ్లీ చెప్పే డైలాగ్ హైటెల్ అని చెప్పొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'చాఫ్టర్ 2 ముందే వచ్చింది', 'ఒకే ఫ్రెమ్‌లో యష్, కోహ్లీ' అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. 

శాండిల్‌వుడ్‌లో హొంబలె ఫిల్మ్స్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతోంది. కేజీఎఫ్, సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలు రూపొందిస్తోంది. మరోవైపు ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా.. కన్నడ ఫాన్స్ హంగామా చేస్తారు. ఇప్పుడు ఈ రెండు జట్టు కట్టడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ-స్పోర్ట్స్ సెక్టార్‌లో జాయింట్‌గా పలు కార్యక్రమాలను రూపొందించుకోవడానికి అవకాశం ఉంది. 

Also Read: Harshal Patel: బయోబబుల్‌ వీడిన బెంగళూరు స్టార్ బౌలర్‌.. చెన్నైతో మ్యాచ్‌లో ఆడేది అనుమానమే!

Also Read: Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' పోస్ట‌ర్‌ వచ్చేసింది.. పవన్‌ కళ్యాణ్ న్యూ లుక్‌ చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News