SRH vs RR Highlights: ఫైనల్లోకి సన్‌రైజర్స్‌.. కావ్య మారన్‌ సంబరాలు మామూలుగా లేవు

Kavyan Maran Expressions Highlighted In IPL 2024 Eliminator 2 SRH vs RR: టాటా ఐపీఎల్‌లో ట్రోఫీ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో ముందడుగు వేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌పై జట్టు విజయంతో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్‌ సంబరాల్లో మునిగితేలింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 25, 2024, 12:00 AM IST
SRH vs RR Highlights: ఫైనల్లోకి సన్‌రైజర్స్‌.. కావ్య మారన్‌ సంబరాలు మామూలుగా లేవు

SRH vs RR Highlights Kavya Maran: ఐపీఎల్‌లో తన ఫ్రాంచైజీ ఆడుతున్న ప్రతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్య మారన్‌ సందడి చేస్తుంటుంది. మ్యాచ్‌ జరుగుతుంటే కెమెరా కళ్లన్నీ ఆమె మీదనే ఉంటాయి. తమ జట్టు బ్యాటింగ్‌ చేస్తుంటే ఫోర్లు, సిక్సర్లు బాదినప్పుడు సంబరాలు.. వికెట్‌ పోతే నిరాశకు గురయి ఆమె పలికించే భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాంటి కావ్య మారన్‌ కీలకమైన మ్యాచ్‌లో ఆమె సంబరాలు అంబరాన్నంటే రీతిలో ఉన్నాయి. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ 2లో రాజస్థాన్‌ రాయల్స్‌పై జట్టు విజయం సాధించిన ఆనందంలో కావ్య సంబరాల్లో మునిగి తేలింది.

Also Read: SRH Vs RR Live Score: ముగిసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

మొదట బ్యాటింగ్‌కు దిగిన సమయంలో అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడుతున్న సమయంలో కావ్య మారన్‌ చప్పట్లతో సందడి చేసింది. అయితే అనంతరం వరుసగా వికెట్లు పడడంతో ఒక్కసారిగా కావ్య ముఖంలో హావభావాలు మారిపోయాయి. బ్యాటర్లు మైదానం వీడుతున్న సమయంలో కుర్చీపై ముభావంగా కూర్చుంది. అనంతరం మళ్లీ బ్యాటర్లు పుంజుకున్న సమయంలో కావ్య మారన్‌ కొంత ఆనందంతో చప్పట్లతో సందడి చేసింది.

Also Read: IPL Eliminator 1 RR vs RCB: బెంగళూరు దురదృష్టం మళ్లీ చెదిరిన ఐపీఎల్‌ ట్రోఫీ కల.. రాజస్థాన్‌ విజయం

రాజస్థాన్‌ బ్యాటింగ్‌ సమయంలో కావ్య మారన్‌ కొంత నిరాశతో కూర్చుండిపోయింది. పవర్‌ ప్లేలో బ్యాటర్లు పరుగులు రాబట్టడంతో కావ్య మారన్‌ కొంత ఇబ్బందిగా ఉండిపోయింది. అనంతరం టామ్‌ కోహ్లెర్‌, ఆ తర్వాత యశస్వి జైస్వాల్‌ వికెట్లు పడడంతో కావ్య ముఖంలో జోష్‌ వచ్చింది. ఇక ఆమె కుర్చీలో నుంచి లేచి ఎగిరి గంతేసింది. కెప్టెన్‌ సంజూ శామ్‌సన్‌ వికెట్‌ కోల్పోయిన వేళ కావ్య ఆనందానికి అవధులు లేవు. మిడిల్‌ ఓవర్లలోకి వచ్చేవరకు రాజస్థాన్‌ ఓటమి వైపు పయనించింది. ఇక కావ్య ముఖంలో హావభావాలు మారిపోయాయి. ఒక్కసారిగా ఆమె సంబరాలు చేసుకుంది. ఆఖరి ఓవర్‌ వచ్చేవరకు విజయం ఖాయం కావడంతో కావ్య సంబరాల్లో ఆనందతాండవం చేసింది. విజయం సాధించడంతో వెంటనే పైకి వెళ్లి తన తండ్రి కళానిధి మారన్‌ వద్దకు వెళ్లి కౌగిలించుకుని పండగ చేసుకుంది. ఈ సందర్భంగా తమ ఫ్రాంచైజీ ప్రతినిధులతో తన సంతోషం పంచుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Trending News