IPL 2023 Live streaming: ఐపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీ.. ఎక్కడ? ఎలా చూడాలో తెలుసా?

IPL 2023 Free Live streaming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసిందే, మరి ఈ మ్యాచ్ లను ఫ్రీగా ఎలా చూడచ్చు? అనే వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 30, 2023, 02:33 PM IST
IPL 2023 Live streaming: ఐపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీ.. ఎక్కడ? ఎలా చూడాలో తెలుసా?

IPL 2023 Live streaming for Free: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 2023లో 52 రోజుల్లో మొత్తం 74 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్ ఏప్రిల్ 1న జరుగుతుంది. ఈ ఐపీఎల్ 16వ సీజన్ స్పెషాలిటీ ఏంటంటే.. ఈసారి క్రికెట్ అభిమానులు ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ చూసేందుకు డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. బ్రాడ్‌కాస్టర్ వయాకాం సంస్థ అన్ని మ్యాచ్‌లు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. దీంతో ఎవరికి వారు తమ మొబైల్ ఫోన్‌లలో IPL 2023 యొక్క అన్ని మ్యాచ్‌లను ఉచితంగా ఆస్వాదించగలరు. 

మొబైల్-ల్యాప్‌టాప్‌లో IPL 2023 ఉచితం

గత సంవత్సరం మాదిరిగానే, ఈసారి డిస్నీ + హాట్‌స్టార్ IPL మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయదు. ఇక ఈ ఏడాది వయాకామ్ 18 భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందింది. Viacom18 BCCI నుండి ఈ ప్రసార హక్కులను రూ. 20,500 కోట్లకు కొనుగోలు చేసింది, అయితే ఇది కేవలం ఒటీటీ విషయం లోనే. ఎందుకంటే గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ భారతదేశంలో టీవీలో IPL మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఓటీటీలో జియో సినిమా యాప్ భారతదేశంలోని వినియోగదారుల కోసం IPL 2023 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ జియో సబ్‌స్క్రైబర్లు మాత్రమే కాకుండా అన్ని టెలికాం ప్రొవైడర్ల యూజర్లు జియో సినిమాకి లాగిన్ చేసుకుని IPL 2023 మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు. అంటే జియో సిం వాడని వారు కూడా లైవ్ మ్యాచ్ లు చూడటానికి ఎలాంటి అదనపు అమౌంట్ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అలాగే వినియోగదారులు జియో సినిమా యాప్ ద్వారా టీవీలో కూడా లైవ్ మ్యాచ్‌లను కూడా చూడవచ్చు, వెబ్‌సైట్ ద్వారా ల్యాప్‌టాప్‌లలో లైవ్ మ్యాచ్‌లను ఉచితంగా ఆస్వాదించవచ్చు. 

TVలో IPL 2023ని లైవ్ లో ఎలా చూడాలి?

టీవీ హక్కులు ప్యాకేజీ A కింద అమ్ముతున్నారు. గతేడాది జూన్‌లో 2023 నుంచి 2027 సంవత్సరాలకు ప్రసార హక్కులను వేలం వేయగా వచ్చే ఐదేళ్లకు భారత్‌లో టీవీ ప్రసార హక్కులను కొనుగోలు చేసేందుకు స్టార్ నెట్‌వర్క్ బీసీసీఐకి రూ.23,575 కోట్లకు పాడుకుంది. ప్యాకేజీ A కింద, స్టార్ నెట్‌వర్క్ 2023 మరియు 2024 సంవత్సరాల్లో 74-74 మ్యాచ్‌లను ప్రసారం చేస్తుంది. అయితే 2025 అలాగే 2026లో 84 మ్యాచ్‌లు ప్రసారం చేయబడతాయి. 2027లో 94 మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఐపీఎల్ మ్యాచ్‌లను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

Also Read: GT vs CSK Dream 11 Prediction: చెన్నై vs గుజరాత్ బిగ్ ఫిట్.. డ్రీమ్ 11 టీం ఇదే!

Also Read: IPL 2023 Opening ceremony: ఐపీఎల్ ఓపెనింగ్లో మెరవనున్న రష్మిక, కత్రినా..ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

 

Trending News