Virat Kohli IPL Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!

Virat Kohli 1st player to hits hundred 30 plus score in IPL. ఐపీఎల్‌లో వంద 30 ప్లస్‌ స్కోర్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. 221 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ ఫీట్ సాదించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 20, 2023, 06:11 PM IST
Virat Kohli IPL Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!

Virat Kohli 1st player to hits hundred 30 plus score in IPL: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌ అని తేడా లేకుండా రికార్డులు తన పేరుపై లిఖించుకుంటూ పోతున్నాడు. తాజాగా ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 30 ప్లస్‌ స్కోరును కోహ్లీ 100 సార్లు చేశాడు. గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో రాహుల్‌ చహర్‌ వేసిన మూడో బంతికి రెండు పరుగులు చేయడం ద్వారా విరాట్ ఈ రికార్డు అందుకున్నాడు.

ఐపీఎల్‌లో వంద 30 ప్లస్‌ స్కోర్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. 221 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ ఫీట్ సాదించాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. గబ్బర్ 209 ఇన్నింగ్స్‌లలో 91 సార్లు 30 ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (167 ఇన్నింగ్స్‌లలో 90 సార్లు 30 ప్లస్‌ స్కోర్), రోహిత్ శర్మ (227 ఇన్నింగ్స్‌లలో 85 సార్లు 30 ప్లస్‌ స్కోర్), సురేష్ రైనా (200 ఇన్నింగ్స్‌లలో 77 సార్లు 30 ప్లస్‌ స్కోర్) టాప్ 5లో ఉన్నారు. 

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్‌తో మ్యాచ్‌కు విరాట్ స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ గాయంతో బాధపడుతున్నాడని,  మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాడు కాబట్టి తానే కెప్టెన్‌గా చేస్తున్నట్లు టాస్‌ సమయంలో తెలిపాడు. బెంగళూరు ఫీల్డింగ్ సమయంలో డుప్లెసిస్‌ స్థానంలో వైశాక్‌ విజయ్‌కుమార్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా రానున్నాడు. 

పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (59), ఫాఫ్ డుప్లెసిస్‌ (84; 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. స్టార్ బ్యాటర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), దినేశ్ కార్తిక్‌ (7) విఫలమయ్యారు. మహిపాల్ లోమ్రోర్ (7), షాబాజ్‌ అహ్మద్‌ (5) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్‌ బౌలర్లలో  హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2 వికెట్స్ పడగొట్టారు. 

Also Read: RCB Yuvendra Chahal: రాజస్థాన్‌కు బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో గొప్ప బహుమతి ఇచ్చింది.. కెవిన్‌ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు!  

Also Read: Sitara Dress : అలియా భట్ పంపిన డ్రెస్సులో సితార.. హర్ట్ అయిన మహేష్‌ బాబు ఫ్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News