Virat Kohli IPL Ban: విరాట్‌ కోహ్లీ మెడ మీద వేలాడుతున్న కత్తి.. ఐపీఎల్ బ్యాన్ తప్పదా?

Virat Kohli may get ban if RCB continue to maintain slow over-rate vs KKR. ఐపీఎల్ 2023లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తాత్కాలిక కెప్టెన్‌ విరాట్‌  కోహ్లీపై ఓ మ్యాచ్‌ నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 26, 2023, 04:02 PM IST
Virat Kohli IPL Ban: విరాట్‌ కోహ్లీ మెడ మీద వేలాడుతున్న కత్తి.. ఐపీఎల్ బ్యాన్ తప్పదా?

Virat Kohli may get ban if RCB continue to maintain slow over-rate vs KKR: ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తాత్కాలిక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మెడ మీద కత్తి వేలాడుతోంది. ఐపీఎల్ 2023లో  కోహ్లీపై ఓ మ్యాచ్‌ నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో జరగబోయే మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేస్తే.. కెప్టెన్‌ కోహ్లీపై ఓ మ్యాచ్‌ నిషేధం పడుతుంది. అంతేకాదు రూ. 30 లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఆర్‌సీబీ తాత్కాలిక కెప్టెన్‌ కోహ్లీ ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్‌ రేట్‌కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో విరాట్ డేంజర్‌ జోన్‌లో ఉన్నాడు. 

లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్లో ఓవర్‌ రేట్‌కు గురయ్యాడు. దాంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం డుప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ తాత్కాలిక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేశాడు. దాంతో కోహ్లీకి రూ. 24 లక్షల జరిమానా పడింది. అంతేకాకుండా ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌తో సహా ప్లేయింగ్ XIలోని ప్రతి ఆటగాడికి రూ. 6 లక్షల జరిమానాను ఐపీఎల్ యాజమాన్యం విధించింది. మరో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇదే కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తోజరిగే మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దిష్ట 90 నిమిషాల్లో 20 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే విరాట్ కోహ్లీపై వేటు పడుతుంది. ఒకవేళ బెంగళూరు కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌ ఉన్నా అతనికి కూడా ఇదే వర్తిస్తుంది. నేటి మ్యాచ్‌లో ఎవరు కెప్టెన్ ఉంటే.. వారిపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది. గాయం కారణంగా ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ చెయ్యట్లేదు. ఐపీఎల్‌ తొలి దశ మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పట్టికతో ఐదో స్థానంలో ఉంది. 

ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. బౌలింగ్‌ చేసే జట్టు నిర్దిష్ట 90 నిమిషాల్లో 20 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే తొలిసారి కెప్టెన్‌కు 12 లక్షల జరిమానా పడుతుంది. రెండోసారి కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టు సభ్యులకు 6 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం కోత ఉంటుంది. ఇక మూడోసారి కెప్టెన్‌కు 30 లక్షలతో పాటు ఒక మ్యాచ్‌ నిషేధం, జట్టు సభ్యులకు 12 లక్షల జరిమానా లేదా 50 శాతం మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధించబడుతుంది. 

Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023కి భారత జట్టు.. వైరల్ అవుతున్న మాజీ కోచ్‌ రవిశాస్త్రి ట్వీట్!  

Also Read: Best Mileage Scooters 2023: పెట్రోల్ తక్కువ తాగి.. మైలేజ్ ఎక్కువగా ఇచ్చే 5 స్కూటర్లు ఇవే! దేశాన్ని కూడా చుట్టేయొచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News