Sunrisers Hyderabad IPL 2023 Full Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని గత రెండు సీజన్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్లేఆఫ్స్ దశకు చేరుకోవడంలో విఫలమైంది. 2013లో డెక్కన్ ఛార్జర్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా పేరు మార్చుకున్నప్పటినుంచి ఎస్‌ఆర్‌హెచ్ ఆరుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో 2016లో మొదటిసారి టైటిల్‌ను గెలుచుకుంది. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2021, 2022లో పేలవ ఆటతో లీగ్ దశ నుంచే ఇంటిబాటపట్టింది. అయితే దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు సారథ్యం వహించి టైటిల్ అందించిన ఏడెన్ మార్‌క్రమ్.. ఐపీఎల్ 2023లో కెప్టెన్సీ చేస్తుండంతో అంచనాలు పెరిగాయి.
ఐపీఎల్ 2023 మార్చి 31న ఆరంభం కానుండగా.. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs RR) తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచుకు కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్.. స్టార్ ప్లేయర్స్ మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్‌లు అందుబాటులో ఉండరు. బ్యాటింగ్‌లో పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌తో పాటు యువ ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, భారత ప్లేయర్ రాహుల్ త్రిపాఠి, కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్, టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోశించనున్నారు. బౌలింగ్ విభాగానికి అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహిస్తాడు. ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ అతడికి అండగా నిలవనున్నారు.
పూర్తి షెడ్యూల్ ఇదే:
మ్యాచ్ 1: ఏప్రిల్ 2 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ (3:30 PM IST)
మ్యాచ్ 2: ఏప్రిల్ 7 - లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో (7:30 PM IST)
మ్యాచ్ 3: ఏప్రిల్ 9 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ (7:30 PM IST)
మ్యాచ్ 4: ఏప్రిల్ 14 - కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా (7:30 PM IST)
మ్యాచ్ 5: ఏప్రిల్ 18 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్ (7:30 PM IST)
మ్యాచ్ 6: ఏప్రిల్ 21 - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై (7:30 PM IST)
మ్యాచ్ 7: ఏప్రిల్ 24 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ (7:30 PM IST)
మ్యాచ్ 8: ఏప్రిల్ 29 - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ (7:30 PM IST)
మ్యాచ్ 9: మే 4 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ (7:30 PM IST)
మ్యాచ్ 10: మే 7 - రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, జైపూర్ (7:30 PM IST)
మ్యాచ్ 11: మే 13 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్ (3:30 PM IST)
మ్యాచ్ 12: మే 15 - గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, అహ్మదాబాద్ (ప్రధాన 7:30 PM IST)
మ్యాచ్ 13: మే 18 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ (7:30 PM IST)
మ్యాచ్ 14: మే 21 - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై (3:30 PM IST)
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
ఏడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, సమర్థ్ వ్యాస్, హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, హెన్రిచ్ క్లాసెన్, సన్వీర్ సింగ్, వివ్రాంత్ శర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఉపేంద్ర యాదవ్, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్ హక్ ఫారూఖీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగీ, భువనేశ్వర్ కుమార్, అకీల్ హొసేన్, మయాంక్ డాగర్, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్.
Also Read: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఐపీఎల్ 2023ని ఆస్వాదించండి! డేటా ఖతం కాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.