RR Vs PBKS Match Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గౌహతిలోని బార్సపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన 8వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 5 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. కానీ అంతకంటే ముందుగా విజయం చివరి వరకు రెండు జట్ల మధ్య దోబూచూలాడింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కేప్టేన్ సంజూ శాంసన్ బౌలింగ్ చేయడానికే ఎంచుకున్నాడు. దీంతో శిఖర్ ధావన్ నేతృత్వంలో తొలుత బ్యాటింగ్ కి వచ్చిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ 86 పరుగులు (56 బంతుల్లో) చేయగా ప్రభుసిమ్రాన్ సింగ్ 60 పరుగులు (34 బంతుల్లో), జితేష్ శర్మ 27 పరుగులు (16 బంతుల్లో) రానించారు.
198 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే తడబడింది. రవిచంద్రన్ అశ్విన్ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా.. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 8 పరుగులకే సరిపెట్టుకున్నాడు. ఆ తరువాత కేప్టేన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. బట్లర్ వికెట్ పడటంతోనే మళ్లీ మ్యాచ్ ఫలితం మారిపోయినట్టు కనిపించింది. సంజూ శాంసన్ 42 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 19 పరుగులు, దవదత్ పడిక్కల్ 21 పరుగులు, రియాన్ పరాగ్ 20 పరుగులు చేశారు.
అయితే, అంతా సునాయసంగానే ఉందనుకుంటున్న తరుణంలో పంజాబ్ కింగ్స్ బౌలర్లకు సిమ్రాన్ హిట్మేర్ తిప్పలుపెట్టాడు. హిట్మెర్ బ్యాటింగ్‌ని ఎదుర్కోనేందుకు పంజాబ్ బౌలర్లు తడబడాల్సి వచ్చింది. హిట్మేర్ దూకుడుకి ధృవ్ జురెల్ కూడా తోడయ్యాడు. 6 వికెట్లు పడిన తరువాత మ్యాచ్ గమనాన్ని మార్చేంతగా వీళ్లిద్దరి పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. మళ్లీ రాజస్థాన్ రాయల్స్‌కి విజయంపై ఆశలురేపేలా చేసింది. పరస్పర సహకారంతో ఆడుతూ హిట్మేర్ 36 పరుగులు చేయగా జురెల్ 32 పరుగులు చేశాడు.
ఇది కూడా చదవండి : Kaviya Maran To Isha Negi: ఐపిఎల్‌లో హైలైట్ అయిన గాళ్స్.. ఐపిఎల్ 2023 లోనూ సందడి చేసేనా..
చివరి ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 18 పరుగులు అవసరం అయ్యాయి. దీంతో కేప్టేన్ శిఖర్ ధావన్ బంతిని శాన్ కుర్రాన్ కి ఇచ్చి జట్టుని గెలిపించే బాధ్యతను అతడి చేతుల్లో పెట్టాడు. శామ్ కుర్రాన్ అద్బుతమైన బౌలింగ్‌తో మళ్లీ మ్యాచ్ విజయం పంజాబ్ కింగ్స్ వశమైంది. 18 పరుగులు అవసరమైన చోట రాజస్థాన్ రాయల్స్ కేవలం 13 పరుగులే చేసి, నిర్ణీత 20 ఓవర్లలో మొత్తం 7 వికెట్ల నష్టానికి 192 పరుగుల వద్దే ఆగిపోవడంతో చివరకు విజయం పంజాబ్ కింగ్స్‌నే వరించింది.
ఇది కూడా చదవండి : Rishabh Pant At DC vs GT Match: మ్యాచ్ చూసేందుకు వచ్చిన రిషబ్ పంత్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదిగో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook