KL Rahul Interview: నా కెప్టెన్సీ వారికి నచ్చలేదేమో.. అందుకే బంతితో కొట్టారు: కేఎల్ రాహుల్

Lucknow Super Giants Captain KL Rahul about Captaincy vs RR Match. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫీల్డర్‌ విసిరిన బంతి ఆ జట్టు కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ను తాకింది. మ్యాచ్ అనంతరం దీనిపై రాహుల్ స్పందించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 20, 2023, 03:07 PM IST
KL Rahul Interview: నా కెప్టెన్సీ వారికి నచ్చలేదేమో.. అందుకే బంతితో కొట్టారు: కేఎల్ రాహుల్

May be they did not like my captaincy says Lucknow Super Giants Captain KL Rahul: ఐపీఎల్‌ 2023లో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. లక్నో నిర్దేశించిన 155 పరుగుల లక్షాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌ 144/6 స్కోరుకే పరిమితమైంది. లక్నో పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి రాజస్థాన్ విజయాన్ని అడ్డుకున్నాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచులో స్వయం తప్పిదాలతో రాజస్థాన్ ఓటమిని కొని తెచ్చుకుంది. 

ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫీల్డర్‌ విసిరిన బంతి కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ను తాకింది. మ్యాచ్ అనంతరం దీనిపై స్పందించిన రాహుల్.. తనదైన శైలిలో నవ్వులు పోయించాడు. తన కెప్టెన్సీ వారికి నచ్చలేదేమో, అందుకే అలా విసిరాడేమో అని రాహుల్ నవ్వుతూ అన్నాడు. మ్యాచ్ అనంతరం కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ... 'మ్యాచ్‌ సందర్భంగా నా టీమ్ మేట్స్ ఒకరు బంతిని విసరగా.. అది నాకు తగిలింది. నా కెప్టెన్సీ సరైన దిశలో లేదని అలా విసిరాడేమో. లేదా నా కెప్టెన్సీ వారికి నచ్చలేదేమో' అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

'మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉంది. మేం బ్యాటింగ్‌ చేసినప్పుడు 10 ఓవర్లు ముగిశాక ఈ పిచ్‌పై 160-170 పరుగులే గొప్ప స్కోరు అవుతుందని అర్ధమైంది. రాజస్థాన్‌ రాయల్స్ జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. కానీ మేం 10 పరుగులు తక్కువగా చేశాం. రాజస్థాన్ లక్ష్య ఛేదన సమయంలో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. రాజస్థాన్‌ జట్టులో టాప్‌ 4 కీలకం. కాబట్టి వారిని త్వరగా ఔట్ చేసేందుకు ప్రయత్నించి సఫలం అయ్యాం. తేమ ప్రభావం లేకపోవడంతో ఇరు జట్లకూ సమాన అవకాశాలు లభించాయి. అంతిమంగా విజయం దక్కడం ఆనందంగా ఉంది' అని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు.

Also Read: DC vs KKR Dream11 Team: ఢిల్లీ vs కోల్‌కతా డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్ ఇవే!  

'మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ వికెట్‌ మీద 180 పరుగులు చేయొచ్చని భావించాం. రాజస్థాన్‌ బౌలర్‌ ట్రెంట్ బౌల్ట్‌ తొలి ఓవర్‌ ముగిసిన తర్వాత మా ఆలోచన మారింది. నేనూ, కైల్ మేయర్స్‌ పిచ్‌ గురించి మాట్లాడుకున్నాం. 180 పరుగులు చేసేంత పిచ్‌ ఇది కాదని అనుకున్నాం. బంతి చాలా తక్కువ ఎత్తులోకి వచ్చింది. అందుకే పవర్‌ ప్లేలో నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. ఇంకాస్త వేగంగా ఆడి ఉంటే 170 పరుగులు చేసేవాళ్లం' అని లక్నో కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ చెప్పాడు. 

Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News