Rohit Sharma IPL Captaincy: Simon Doull Feels Rohit Sharma is Not a Best Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యధిక టైటిల్స్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి రోహిత్ ఐదు టైటిల్స్ అందించాడు. ఈ కారణంగానే అతడికి టీమిండియా కెప్టెన్సీ దక్కింది. ఇటీవలి కాలంలో క్రికెట్‌లో రోహిత్ కెప్టెన్సీ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో రోహిత్ ఒకడని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం కాదంటున్నారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ తాజాగా ఈ విషయంపై స్పందించాడు. గత సంవత్సరం ఐపీఎల్ మరియు టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ విఫలమయ్యాడని, ఈ ఏడాది కూడా అదే జరుగుతోందన్నాడు.
రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ మాత్రం కాదని, అత్యుత్తమ జట్టు దొరకడం వల్లే ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు గెలవగలిగాడని సైమన్ డౌల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023కి సైమన్ డౌల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడుతున్న రోహిత్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే సైమన్ డౌల్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఎందుకు ఇంత హైప్ ఉందో నాకు అర్థం కావడం లేదు. రోప్ట్ మంచి కెప్టెన్ కానీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదు. అతనికి బెస్ట్ టీమ్ దొరికింది. అందుకే టైటిల్స్ గెలిచాడు' అని అన్నాడు.
'ఐపీఎల్ 15వ సీజన్ నుంచి రోహిత్ శర్మకు ఏం అర్థం కావడం లేదు. కెప్టెన్‌గా విఫలం అవుతున్నాడు. కేవలం ఐపీఎల్‌లోనే కాదు భారత్ తరఫున ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ కెప్టెన్‌గా విఫలమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో కూడా రోహిత్ కెప్టెన్సీ పేలవంగా ఉంది. ఈ ఆటతో ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే' అని జియో సినిమాతో సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు. ప్రశాంతమైన ప్రవర్తన, ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం మరియు వ్యూహాత్మక చతురత కారణంగానే రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిశాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించి వారి నైపుణ్యాలను పెంపొందించడంలో కూడా రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆ చరిష్మా లేదు.
ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 191 పరుగులే చేశాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అయితే రెండు సార్లు డకౌటయ్యాడు. గతేడాది వరుస పరాజయాలతో పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సారి కూడా ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్.. ఆపై పుంజుకుంది. ముంబై ఆటగాళ్లందరూ ఫామ్‌లోకి రావడంతో వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. మంగళవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. మిగిలిన మూడు మ్యాచులు గెలిస్తే.. అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.
Also Read: CSK vs DC: చెపాక్‌లో చెన్నైకి చెత్త రికార్డు.. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ చేస్తుందా?
Also Read: Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.