RCB vs DC: బెంగళూరు అద్భుత విజయం.. ఢిల్లీకి వరుసగా ఐదో ఓటమి!

Royal Challengers Bangalore won by 23 runs vs Delhi Capitals. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 15, 2023, 08:00 PM IST
RCB vs DC: బెంగళూరు అద్భుత విజయం.. ఢిల్లీకి వరుసగా ఐదో ఓటమి!

Royal Challengers Bangalore won by 23 runs vs Delhi Capitals in IPL 2023: బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. మనీష్ పాండే (50; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. అన్రిచ్ నోర్జ్ (23), అక్షర్ పటేల్ (21) పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ ఓటమి తప్పించుకుంది. బెంగళూరు బౌలర్ విజయ్ కుమార్ వైశాఖ్ మూడు వికెట్స్ పడగొట్టాడు. ఐపీఎల్ 2023లో బెంగళూరుకి ఇది రెండో విజయం కాగా.. ఢిల్లీకి వరుసగా ఇది ఐదో ఓటమి. 

చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్ త్వరగానే పెవిలియన్ చేరింది. అనూజ్ రావత్ సూపర్ ఫీల్డింగ్‌తో తొలి ఓవర్‌లోనే ఓపెనర్ పృథ్వీ షా (0) రనౌట్ అయ్యాడు. రెండో ఓవర్‌ వేసిన వ్యాన్ పార్నెల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన మిచెల్ మార్ష్ (0) డకౌట్ అయ్యాడు. మూడో ఓవర్‌లో యశ్ ధూల్ (1)ను మొహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. 6వ ఓవర్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (19)ను విజయ్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో మనీశ్ పాండే నిలకడగా ఆడినా.. అభిషేక్ పోరెల్ (5) క్యాచ్ ఔట్‌ అయి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ (21) అండతో మనీశ్ పరుగులు చేశాడు. విజయ్ కుమార్ మరోసారి చెలరేగి అక్షర్ పటేల్ ను ఔట్ చేశాడు.  మనీశ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాండే ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో ఢిల్లీ గెలుపు ఆశలు వదిలేసుకుంది. అమన్ ఖాన్‌, అన్రిచ్ నోర్జ్ మరో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో విజయ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (50; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో రాణించాడు. ఫాఫ్ డుప్లెసిస్‌ (22; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), మహిపాల్ లామ్రోర్‌ (26; 18 బంతుల్లో 2 సిక్స్‌లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (24; 14 బంతుల్లో 3 సిక్స్‌లు) దూకుడు ఆడారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్‌, కుల్దీప్ యాదవ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

Also Read: MS Dhoni Retirement: ఐపీఎల్ 2023 అనంతరం ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌ ఇవ్వడం 2000 శాతం పక్కా.. చెన్నై మాజీ ప్లేయర్!  

Aslo Read: Ananya Panday Hot Pics: అనన్య పాండే హాట్ ఫోటోషూట్.. బ్యాక్ అందాలతో హీట్ పుట్టిస్తోన్న లైగర్ పోరి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News