Virat Kohli and MS Dhoni eye on Huge IPL Records: ఐపీఎల్ 2023లో నేడు హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. సోమవారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం అవుతుంది. జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. బెంగళూరు, చెన్నై రెండూ టాప్ జట్లే కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే అభిమానుల కళ్లన్నీ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ, బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. ఈ ఇద్దరు నేటి మ్యాచులో టాప్ రికార్డ్స్ సాధించే అవకాశం ఉంది. అవేంటో ఓసారి చూద్దాం.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మిస్టర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీకి మంచి రికార్డు ఉంది. ఈ క్రమంలోనే బెంగళూరుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం ధోనీ ముందుంది. ఇప్పటివరకు బెంగళూరుపై 31 ఇన్నింగ్సుల్లో 39.90 సగటు, 140 స్ట్రైక్ రేటుతో 838 పరుగులు చేశాడు. నేటి మ్యాచులో మరో 2 పరుగులు చేస్తే.. బెంగళూరుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ధోనీ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరుపై ఉంది. బెంగళూరుపై వార్నర్ 839 పరుగులు చేశాడు.
అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ కూడా సూపర్ రికార్డు ఉంది. ఇప్పటివరకు చెన్నైపై 29 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 39.16 సగటుతో 979 పరుగులు చేశాడు. నేటి మ్యాచ్‌లో కోహ్లీ మరో 21 పరుగులు చేస్తే.. చెన్నైపై వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రమే చెన్నైపై వెయ్యి పరుగులు చేశాడు. నేడు ఈ జాబితాలోకి కోహ్లీ చేరే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచులలో కోహ్లీ మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. చెన్నైపై చెలరేగుతాడని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఒకే మైదానంలో అత్యధిక టీ20 హాఫ్ సెంచరీలు.. టాప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్! పూర్తి లిస్ట్ ఇదే
బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో ఓ రికార్డు బద్దలు కొట్టేందుకు చెన్నై ఆటగాడు అజింక్య రహానే రెడీగా ఉన్నాడు. ఇప్పటివరకు 219 టీ20 ఇన్నింగ్స్‌లలో రహానే 5732 పరుగులు చేశాడు. ఇందులో 595 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో ఐదు ఫోర్లు బాదితే.. టీ20 ఫార్మాట్‌లో 600 ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అదే సమయంలో ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత బ్యాటర్‌గా జింక్స్ నిలుస్తాడు. 595 ఫోర్లలో 440 ఐపీఎల్‌లో వచ్చినవే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.