IPL 2023 Gujarat Titans Vs Chennai Super Kings Match 1 Live Updates: ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో చెన్నైను గుజరాత్ చిత్తు చేసింది. ఆఖర్లో రషీద్ ఖాన్, తైవాటియా మెరుపులు మెరిపించి జట్టుకు విజయాన్ని అందించారు. 179 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ ఛేదించింది. గిల్ (63) పరుగులతో మంచి పునాది వేయగా.. విజయ్ శంకర్ (27) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (92) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.