KKR Vs RR Highlights IPL 2023: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మొదటి బాల్ నుంచే బౌలర్లను ఊచకోత కోస్తూ.. పరుగుల వదర పారిస్తున్నాడు. గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై మొదటి ఓవర్ నుంచే బాదుడు మొదలు పెట్టాడు. తొలి ఓవర్‌లోనే 6,6,4,4,2,4 బాది.. కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణాకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లలో 52.27 సగటు, 167.15 స్ట్రైక్ రేట్‌తో 575 పరుగులు చేశాడు. ఇందులో 75 ఫోర్లు, 26 సిక్సర్లు ఉన్నాయి.
ఆరెంజ్ క్యాప్ రేసులో యశస్వి జైస్వాల్ ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది. 576 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో డుప్లెసిస్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. యశస్వి ఒక పరుగు తక్కువతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తరువాత మూడో స్థానంలో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. గిల్ ఈ సీజన్‌లో 469 పరుగులు చేశాడు.
యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో జైస్వాల్‌కు ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఈ సీజన్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే సెంచరీలు సాధించగా.. యశస్వి జైస్వాల్ ఒకడు. ముంబై ఇండియన్స్‌పై యశస్వి 124 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గురువారం కేకేఆర్‌పై అజేయంగా 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. కేకేఆర్ జట్టులో వెంకటేష్ అయ్యర్ (57) ఒక్కడే రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం రాజస్థాన్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి.. 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జైస్వాల్ 98 పరుగులతో చెలరేగగా.. కెప్టెన్ సంజూ శాంసన్ 48 రన్స్ చేశాడు. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్‌కు మరింత చేరవ అవ్వగా.. కేకేఆర్ దాదాపు నిష్క్రమించింది.
Also Read: CBSE Result 2023: సీబీఎస్ఈ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి