IPL Records: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్లు ఇవే.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే..?

Most Expensive Overs In IPL: ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టినా.. 36 పరుగులు వస్తాయి. కానీ ఐపీఎల్‌ ఒక ఓవర్‌లో 36 పరుగుల కంటే ఎక్కువ రెండుసార్లు వచ్చాయి. క్రిస్ గేల్, రవీంద్ర జాడేజా, పాట్ కమ్మిన్స్ ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉండగా.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే.?  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 11:04 AM IST
IPL Records: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్లు ఇవే.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే..?

Most Expensive Overs In IPL: ఐపీఎల్‌ అంటేనే పరుగుల వరద. బ్యాట్స్‌మెన్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపించేకొద్ది.. ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంటుంది. ఈ సీజన్‌లో 200కిపైగా పరుగులు చేసిన జట్లు ఉన్నాయి. ఆ లక్ష్యాన్ని ఛేదించిన జట్లు ఉన్నాయి. ప్రతి సీజన్‌లో కొన్ని చరిత్రలో నిలిచేపోయే ఇన్నింగ్స్‌లు కనిపిస్తాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం బౌలర్లకు ఓ సవాల్. బ్యాట్స్‌మెన్లు పునాకం వచ్చినట్లు సిక్సర్లు బాదుతుంటే.. ఎన్నోసార్లు ప్రేక్షకులే ఫీల్డర్లయ్యారు. ఐపీఎల్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లపై ఓ లుక్కేయండి.  

ప్రశాంత్ పరమేశ్వరన్ 

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా ప్రశాంత్ పరమేశ్వరన్ నిలిచాడు.  2011 సీజన్‌లో కొచ్చి టస్కర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ప్రశాంత్ పరమేశ్వరన్‌ వేసిన ఒక ఓవర్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాది.. మొత్తం 37 పరుగులు రాబట్టాడు. ఇందులో ఒక నోబాల్ కూడా ఉంది. ఈ ఓవర్‌లో ఆరు బంతుల్లో 6, నో బాల్ +6, 4, 4, 6, 6, 4 విధ్వంసం సృష్టించాడు. 

హర్షల్ పటేల్ 

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఆర్‌సీబీ పేసర్ హర్షల్ పటేల్‌కు చుక్కలు చూపించాడు. ఆఖరి ఓవర్ హర్షల్ పటేల్ వేయగా.. ఈ ఓవర్‌లో 37 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 5 సిక్సర్లు, ఒక ఫోర్ ఉండగా హర్షల్ ఓ నోబాల్ కూడా వేశాడు. ఆరు బంతుల్లో 6,6, 6nb, 6, 2, 6, 4 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో జడ్డూ కేవలం 28 బంతుల్లో 221.43 స్ట్రైక్ రేట్‌తో 62 రన్స్ చేయడం విశేషం.జడేజా విధ్వంసంతో చెన్నై స్కోరు 191 స్కోరుకు చేరింది. ఒక ఓవర్‌లో 5 సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

Also Read: Virat Kohli, Sourav Ganguly: గంగూలీని కొరకొర చూసిన కోహ్లీ.. షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకున్నాడా ? వీడియో వైరల్

డానియేల్ సామ్స్

గత సీజన్‌లో కేకేఆర్‌ తరుఫున బరిలోకి పాట్ కమ్మిన్స్.. ఒక మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బ్యాట్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్ డానియేల్ సామ్స్ వేసిన ఒక ఓవర్‌లో ఏకంగా 35 రన్స్ రాబట్టాడు. ఇందులో 4 సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. సామ్స్ ఒక నోబాల్ వేయగా.. ఆ బాల్‌కు రెండు రన్స్ వచ్చాయి. ఈ ఓవర్‌లో 6,4,6,6,2nb,4,6 రన్స్ వచ్చాయి. ఐపీఎల్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మూడో బౌలర్‌గా సామ్స్ నిలిచాడు.

Also Read: IPL Records: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News