IPL 2023 Points Table: టాప్-3లోకి దూసుకువచ్చిన ముంబై.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?

Mumbai Indian Reached Top 3 in IPL Points Table: ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్‌-3కి దూసుకువచ్చింది. గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్‌లోనే ఉంది. చెన్నై రెండోస్థానంలో నిలిచింది. మిగిలిన జట్ల పరిస్థితి ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : May 10, 2023, 06:58 AM IST
IPL 2023 Points Table: టాప్-3లోకి దూసుకువచ్చిన ముంబై.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?

Mumbai Indian Reached Top 3 in IPL Points Table: ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో అన్ని జట్ల మధ్య భారీ పోటీ నెలకొంది. ప్లే ఆఫ్‌ రేసులో 10 జట్లు కూడా పోటీ పడుతున్నాయి. మొదట్లో వరుస ఓటములతో డీలా పడిపోయిన ముంబై.. అనూహ్యంగా దూసుకువచ్చింది. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడోస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించడం ఖాయం అనుకున్న ఢిల్లీ.. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌లో గెలుపొంది.. ప్లే ఆఫ్‌ రేసులో సై అంటున్నాయి. రాజస్థాన్ రాయల్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో, పంజాబ్ కింగ్స్ జట్లు వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతూ.. పాయింట్ల పట్టికలో క్రమంగా కిందకు పడిపోతున్నాయి. 

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో దాదాపు ప్లే ఆఫ్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకుంది. ప్రస్తుతం టాప్ ప్లేస్‌పైనే ఆ జట్టు కన్నేసింది. గతేడాది గ్రూప్ దశలోనే నిష్ర్కమించిన చెన్నై.. ఈసారి మళ్లీ పుంజుకుంది. 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 13 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌లు నెగ్గితే.. ప్లే ఆఫ్ బెర్త్ ఫిక్స్ చేసుకుంటుంది. ముంబై 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 12 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకుంది. టాప్‌-4లోకి ముంబై రావడంతో లక్నో, రాజస్థాన్ స్థానాలు కిందకుపోయాయి.

లక్నో జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 11 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ అంచనాలకు మించి రాణించాల్సిందే. ఇక రాజస్థాన్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు సమానంగా పాయింట్లు కలిగి ఉన్నాయి. కాకపోతే నెట్‌ రన్‌రేట్‌లో తేడాతో పాయింట్ల పట్టికలో వెనుకా ముందు ఉన్నాయి. ఈ జట్లు 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 10 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసుకు పోటీ పడుతున్నాయి. ఇక చివరి రెండు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లు 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించాయి. ఈ జట్లు కూడా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. ప్లే ఆఫ్ రేసులో ఉంటాయి. 

ఈసారి ప్లే ఆఫ్‌కు చేరేందుకు అన్ని జట్లకు నెట్‌ రన్‌రేట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ముంబై మూడోస్థానంలో ఉన్నా.. నెట్‌ రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా కేకేఆర్, ఆర్‌సీబీ, పంజాబ్, హైదరాబాద్, ఢిల్లీ జట్లు కూడా మిగిలిన మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సి ఉంది. 

Also Read: Karnataka Assembly Elections 2023: ఈ సాలా విక్టరీ నమ్దే.. కర్ణాటకలో నేడే పోలింగ్‌.. ఓటరు తీర్పుపై ఉత్కంఠ..!  

Also Read: Jangaon MLA Muthireddy Yadagiri Reddy: ప్రత్యర్ధులు నా బిడ్డను ఉసిగొల్పారు.. ఫోర్జరీ కేసుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రియాక్షన్ ఇదే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News