Virat Kohli Emotional Post: ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతిసారి బరిలోకి దిగడం.. చివరి వరకు పోరాడి ఓడిపోవడం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు పరిపాటిగా మారింది. ఒక్కసారైనా కప్ కొడుతుందని అభిమానులు.. ఒక్క టైటిల్ అందించాలని విరాట్ కోహ్లీ పోరాటం గత 16 సీజన్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రతి సీజన్‌లో ఒకరిద్దరిపైనే ఎక్కువగా ఆధారపడటం ఆర్‌సీబీ విజయ అవకాశాలను దెబ్బ తీస్తోంది. కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు బెంగుళూరు ఓటమికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు అందరూ చేతులెత్తేశారు. బౌలింగ్‌లో సిరాజ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. జట్టుగా ఆడడంలో బెంగుళూరు విఫలం అయింది.
విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో కూడా చెలరేగి ఆడాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో జట్టను ప్లే ఆఫ్స్ చేర్చేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అయినా పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో సీజన్‌ను ముగించింది. బెంగుళూరుకు థ్యాంక్యూ చెబుతూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. "ఈ సీజన్‌లో కొన్ని క్షణాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ మేము లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. నిరాశ చెందినా.. భావోద్వేగాలను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మాకు అడుగడుగునా మద్దతు ఇస్తున్నందుకు మద్దతుదారులకు కృతజ్ఞతలు.." అని విరాట్ కోహ్లీ రాసుకొచ్చాడు. ఈ సీజన్‌లో కోహ్లీ 14 మ్యాచ్‌ల్లో 639 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
A season which had it's moments but unfortunately we fell short of the goal. Disappointed but we must hold our heads high. To our loyal supporters, grateful for backing us every step of the way. pic.twitter.com/82O4WHJbbn
— Virat Kohli (@imVkohli) May 23, 2023
బెంగుళూరు ఓటమికి ప్రధాన కారణాలు..
బెంగుళూరు జట్టులో ఫినిషర్‌గా దినేష్ కార్తీక్ పూర్తిగా విఫలమయ్యాడు. గత సీజన్‌లో అదరగొట్టిన కార్తీక్ ఈ సీజన్‌లో ఏ మాత్రం ఆకట్టులేకపోయాడు. దినేష్ కార్తీక్ జట్టులో ఉండడంతో మరో ఫినిషర్‌ను జట్టు కొనుగోలు చేయలేదు. ఆరు, ఏడో స్థానాల్లో బ్యాట్స్‌మెన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ విషయాన్ని కెప్టెన్ డుప్లెసిస్ కూడా అంగీకరించాడు. అదేవిధంగా వన్‌డౌన్‌లో కూడా సరైన బ్యాట్స్‌మెన్ దొరకలేదు. రజత్ పాటిదార్ గాయంతో దూరమవ్వడం దెబ్బ తీసింది. మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్‌లను ప్రయత్నించినా.. ఒక్కరు కూడా ఆకట్టుకోలేదు. చివరకు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను మూడోస్థానంలో ఆడించింది. దీంతో మిడిల్ ఆర్డర్ బలహీనపడింది. రజత్ పటీదార్‌కు సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంలో ఆర్‌సీబీ విఫలమైంది.
బౌలింగ్‌లో కూడా నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం బెంగుళూరు విజయాలపై ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2022 వేలానికి ముందు యుజ్వేంద్ర చాహల్‌ను విడుదల చేసింది. అప్పటి నుంచి స్పిన్ విభాగం బలహీన పడిపోయింది. వనిందు హసరంగాపై జట్టు చాలా ఆశలు పెట్టుకున్నా.. పెద్దగా ఆకట్టుకోలేదు. న్యూజిలాండ్ స్పిన్ ఆల్ రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ రాణించలేదు. కర్ణ్ శర్మ మెరుపులు ఒకటి రెండు మ్యాచ్‌లకే పరిమితం అయ్యాయి. పేస్ బౌలింగ్‌లో కూడా సిరాజ్ మినహా ఎవరూ రాణించలేదు.
Also Read: Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హఠాన్మరణం.. కారణం ఇదే..!
Also Read: GT vs CSK Dream11 Prediction Team: ప్లేఆఫ్స్ సమరం నేడే.. గుజరాత్ Vs చెన్నై.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి