IPL 2023: ఐపీఎల్ తుదిపోరులో చెన్నైని ఢీ కొట్టేదెవరు, ముంబై వర్సెస్ గుజరాత్ బలబలాలు, ఎవరికి విజయావకాశాలు

IPL 2023: ఐపీఎల్ 2023 ఘట్టం ముగియవచ్చింది. ఇంకో రెండు మ్యాచ్‌లతో ఐపీఎల్ సీజన్ 16 ముగిసిపోనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్‌‌లో ఎవరు తమతో తలపడతారోనని చెన్నై సూపర్‌కింగ్స్ వేచిచూస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2023, 09:45 AM IST
IPL 2023: ఐపీఎల్ తుదిపోరులో చెన్నైని ఢీ కొట్టేదెవరు, ముంబై వర్సెస్ గుజరాత్ బలబలాలు, ఎవరికి విజయావకాశాలు

IPL 2023: ఐపీఎల్ 2023లో ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 2 ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. లక్నోపై విజయంతో ముంబై ఇండియన్స్ జోష్‌లో ఉంటే..చెన్నైపై పరాజయంతో గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిలో ఉంది. 

దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులను రంజింపజేస్తున్న ఐపీఎల్ 2023 ముగింపు మరో రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. ఇవాళ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ , మే 28న జరగనున్న ఫైనల్‌తో ఐపీఎల్ 2023 ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ వర్సెస్ 5 టైమ్స్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2కు సిద్ధమయ్యాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుతో తలపడనుంది. క్వాలిఫయర్ 1లో చెన్నై చేతిలో పరాజయంతో గుజరాత్ టైటాన్స్ తీవ్ర ఒత్తిడిలో ఉంటే..ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ఇండియన్స్ ఊపులో ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ నడ్డి విరిచిన ముంబై కొత్త ఆశాకిరణం ఆకాష్ మద్వాల్ మరో సంచలనం సృష్టిస్తే ఇక హార్దిక్ సేన ఇంటికి వెళ్లిపోవల్సిందే. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టును గెలవాలంటే ధోనీ తరహా స్ట్రాటెజీ తప్పకుండా అవలంభించాల్సి ఉంటుంది. గుజరాత్ బ్యాటర్లను నిలువరించేందుకు ఫీల్డింగ్ వ్యూహం పగడ్బందీగా ఉండాలి. ముఖ్యంగా ఓపెనింగ్ జంట ఇషాన్ కిషన్, రోహిత్ సేనలు మంచి ఆరంభాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత సూర్య కుమార్, గ్రీన్ కామెరూన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్ ఉండనే ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు నిలబడినా సులభంగా 200 స్కోరు దాటేయవచ్చు. ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగితే మాత్రం గుజరాత్‌ను కట్టడి చేయాలంటే 200 స్కోరు దాటాల్సిందే. 

ఇక క్వాలిఫయర్ 1లో చెన్నై చేతిలో పరాజయంతో ఒత్తిడిలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించాలంటే శుభమన్ గిల్, విజయ్ శంకర్, హార్డిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా కలసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శుభమన్ గిల్ ఫామ్ ఆ జట్టుకు కలిసిరానుంది. చివర్లో వచ్చి మెరుపులు కురిపిస్తున్న రషీద్ ఖాన్ అదే ఫామ్ కొనసాగించాల్సి ఉంటుంది. బౌలింగ్ విభాగంలో షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ పేస్ ఎలా ఉంటుందో చూడాలి.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 అంచనా

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్య కుమార్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, హ్రితిక్ షోకీన్ లేదా నెహాల్ వదేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, బెరెన్ డార్ఫ్, ఆకాశ్ మద్వాల్, కుమార్ కార్తికేయ 

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 అంచనా

హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్ లేదా అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, జోష్ లిటిల్ లేదా యష్ దయాల్, మోహిత్ శర్మ, షమీ

Also read: IPL 2023 QF-1: చెన్నై-గుజరాత్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు, కారణాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News