Mohit Sharma IPL 2023: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో అమితుమీ తేల్చుకోనుంది. గుజరాత్ బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ (129) సెంచరీతో చెలరేగగా.. బౌలింగ్‌లో మోహిత్ శర్మ 2.2 ఓవర్లలోనే 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీరోల్ ప్లే చేశారు.
ఈ సీజన్‌లో మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 34 ఏళ్ల మోహిత్ శర్మ ఐపీఎల్‌లో రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. 2022 సీజన్‌లో గుజరాత్ జట్టుకు నెట్ బౌలర్‌గా సేవలు అందించిన మోహిత్ శర్మ.. ఈ సీజన్‌లో మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు. 2022 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో మోహిత్ శర్మను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ సీనియర్ ప్లేయర్‌ను నెట్ బౌలర్‌గా జట్టులో చేర్చుకుంది. నెట్స్‌లో గుజరాత్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌తో జట్టు మేనేజ్‌మెంట్‌ను మెప్పించాడు. ఈ సీజన్‌కు ముందు జట్టులోకి తీసుకుంది.
అనూహ్యంగా అవకాశం దక్కడంతో మోహిత్ శర్మ చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో 13.54 సగటుతో 24 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ తర్వాత మోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌పై మోహిత్ శర్మ బౌలింగ్ చేసిన తీరు అమోఘం అని చెప్పొచ్చు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను గుజరాత్ చేతుల్లోకి తీసుకువచ్చాడు.
ముంబై ఇండియన్స్‌పై 5 వికెట్లు తీయడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు మ్యాచ్ అనంతరం మోహిత్ శర్మ తెలిపాడు. సూర్య, తిలక్ బ్యాటింగ్ చేసిన తీరు తమపై ఒత్తిడి పెంచిందని చెప్పాడు. అయితే కీలక సమయంలో వారిని ఔట్ చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నామన్నాడు. సూర్యకుమార్ యాదవ్‌కు బౌలింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదని ముందే అనుకున్నట్లు చెప్పాడు. లైన్ అండ్ లెంగ్త్‌పై దృష్టిపెడితే సరిపోతుందని.. మ్యాచ్‌లో అదే అమలు చేశానని పేర్కొన్నాడు.
Also Read: Palnadu Murder Case: కుమారుడి తల నరికిన తండ్రి.. ఊరంతా తిరుగుతూ హల్‌చల్
Also Read: New Parliament Building: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి టీడీపీ.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి