S Sreesanth advises Virat Kohli ahead of DC vs RCB Match in IPL 2023: ఐపీఎల్ 2023లో నేడు డబుల్ బొనాంజా ఉంది. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఢిల్లీలో జరగనుంది. ఐపీఎల్ 2023లో బెంగళూరు ఐదవ స్థానంలో ఉండగా.. ఢిల్లీ అట్టడుగున ఉంది. ఇపటివరకు ఆడిన 9 మ్యాచులలో 5 విజయాలు అందుకున్న ఫాఫ్ సేన 10 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మరోవైపు 9 మ్యాచులలో 3 విజయాలు అందుకున్న ఢిల్లీ ఖాతాలో 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచులో ఢిల్లీ ఫెవరెట్ అని చెప్పొచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా ఓ ఇద్దరు దిగ్గజాలు తారసపడే అవకాశం ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాజీ సారథి విరాట్ కోహ్లీ ఎదురుపడనున్నారు. బెంగళూరు, ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి కరచాలనం ఇచ్చేందుకు కూడా కోహ్లీ విముఖత చూపించాడు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఇందుకు సంబందించిన వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి బెంగళూరు, ఢిల్లీ జట్లూ ఢిల్లీ వేదికగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇలాంటి పరిస్థితే ఎదురువుతుందా? అనే అనుమానం క్రికెట్ అభిమానులలో నెలకొంది. అయితే భారత మాజీ బౌలర్ ఎస్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించి.. గంగూలీకి అంకితమివ్వాలని సూచించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను 'స్టార్ స్పోర్ట్స్' తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు సంబంధించి మూడు పాయింట్ల గురించి ఎస్ శ్రీశాంత్ తన అభిప్రాయాలను చెప్పాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ - బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ 50వది. అందుకే ఇది గోల్డెన్ మ్యాచ్. నిషేదానికి గురైన శ్రీశాంత్.. ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 'స్టార్ స్పోర్ట్స్' షోలో శ్రీశాంత్ ఏమన్నాడో ఓసారి చూద్దాం.
శ్రీశాంత్ ఏమన్నాడంటే:
# విరాట్ కోహ్లీ వర్సెస్ డేవిడ్ వార్నర్ ఆటను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో అద్భుతంగా పోరాడుతోంది. ఇప్పటికే ఢిల్లీపై గెలిచిన ఉత్సాహంతో ఉంది.
# 16వ సీజన్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా మారిన ఆన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో బెంగళూరు బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరం.
# విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం చూడాలని ఉంది. ఆ సెంచరీని సౌరవ్ గంగూలీకి అంకితం ఇవ్వాలి. కోహ్లీ నీ ఆట ఆడి బెంగళూరుని గెలిపించు.
Also Read: Team India Head Coach MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ.. హింట్ ఇచ్చిన సునీల్ గవాస్కర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.