Anushka Sharma Cheerleader: భర్త కోసం చీర్‌లీడర్‌గా మారిన అనుష్క శర్మ.. వైరల్ పిక్స్!

Anushka Sharma becomes a cheerleader for husband Virat Kohli in IPL 2023. స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఐపీఎల్ 2023లో సందడి చేశారు. స్టాండ్స్‌లో కూర్చోని బెంగళూరు జట్టును సపోర్ట్‌ చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 11, 2023, 05:59 PM IST
  • చీర్‌లీడర్‌గా మారిన అనుష్క శర్మ
  • అనుష్క శర్మ వైరల్ పిక్స్
  • స్టాండ్స్‌లో అనుష్క శర్మ
Anushka Sharma Cheerleader: భర్త కోసం చీర్‌లీడర్‌గా మారిన అనుష్క శర్మ.. వైరల్ పిక్స్!

Anushka Sharma becomes a cheerleader for husband Virat Kohli in IPL 2023: ఐపీఎల్ 2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాత్రి లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క వికెట్ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్‌ డుప్లెసిస్‌ (79 నాటౌట్‌) టాప్ స్కోరర్. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో చివరి బంతికి ఊహించని విజయాన్ని అందుకుంది. మార్కస్‌ స్టొయినిస్‌ (65), నికోలస్‌ పూరన్‌ (62) అద్భుత హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ సందడి చేశారు. స్టాండ్స్‌లో కూర్చోని బెంగళూరు జట్టును సపోర్ట్‌ చేశారు. ముఖ్యంగా ధాబా భర్త సిక్స్, బౌండరీలు బాదినప్పుడు చప్పట్లు కొడుతూ మరింత జోష్‌ నింపారు అనుష్క. అయితే హాఫ్ సెంచరీ అనంతరం కోహ్లీ ఔట్ అవగానే కాస్త నిరాశపడ్డా.. ఫాఫ్‌ డుప్లెసిస్‌ షాట్లు ఆడుతుంటే తెగ ఎంజాయ్ చేశారు. ఇక బెంగళూరు ఫీల్డింగ్ సమయంలో ఆ జట్టులో అనుష్క మరింత జోష్‌ నింపారు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌.. మొహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించి విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్యాచ్‌ పట్టిన విరాట్ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ తన భర్తను ఆభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దాంతో ఫాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. 'భర్త విరాట్ కోహ్లీ కోసం చీర్‌లీడర్‌గా మారిన అనుష్క శర్మ' అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Biggest Sixes In IPL: ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్స్‌లు.. 125 మీటర్ల సిక్స్ కొట్టిందెవరో తెలిస్తే షాక్ అవుతారు! అస్సలు ఊహించరు  

Also Read: Kendra Lust-Rinku Singh: రింకు సింగ్‌ ఆటకు ఫిదా అయిన హాట్ పోర్న్‌స్టార్‌.. ట్వీట్ వైరల్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

Trending News