/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

IPL Mega Auction 2022: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. 561 కోట్లలో వాటా కోసం 6 వందలమంది క్రికెటర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధమయ్యారు. ఆ వివరాలు ఇలా

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండ్రోజులపాటు జరగనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 8 జట్లకు తోడుగా కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వచ్చి చేరాయి. ఇప్పటికే వివిధ జట్లు 33 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, మరో 6 వందలమంది ఆటగాళ్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో భారతీయులు 377 మంది కాగా, 223 విదేశీయులున్నారు. అయితే అన్ని జట్లు కలిపి గరిష్టంగా 227 మంది మాత్రమే ఈ రెండ్రోజుల వేలం ద్వారా ఎంపిక  కానున్నారు. ఒక్కొక్క టీమ్‌లో కనిష్టంగా 18 మంది గరిష్టంగా 25 మంది ఉండవచ్చు. 8 మంది విదేశీయులు కచ్చితంగా ఉండాలి. అదే సమయంలో ప్రతి జట్టు గరిష్టంగా 90 కోట్ల వరకూ ఖర్చు చేసుకోవచ్చు.

రెండ్రోజులపాటు జరిగే వేలంలో ఏ క్రికెటర్ ఎంత ధర పలుకుతాడనేది ఆసక్తిగా మారింది. చాలామంది క్రికెటర్ల జట్లు మారిపోనున్నాయి. ప్రతి ఫ్రాంచైజీ ఆటగాళ్లను ఎంచుకునేందుకు కనిష్టంగా 67.5 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రైట్ టు మ్యాచ్ కార్డ్‌ను ఈసారి తొలగించారు. ఇప్పటి వరకైతే..వేలంలో మరొకరు సొంతం చేసుకున్న ఆటగాడిని అదే ధర చెల్లించి గత ఫ్రాంచైజీ తీసుకునే అవకాశముండేది. ఈసారి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో ఆ క్లాజ్ తొలగించారు. 

తొలిరోజు అంటే ఇవాళ జరిగే వేలంలో 161 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. మిగిలిన ఆటగాళ్లు రేపు జరిగే వేలంలో ఉంటారు. ఇవాళ్టి వేలం (IPL 2022 Mega Auction) ముగిసిన తరువాత ఇంకా ఏయే ఆటగాళ్లు వేలంలో ఉంటే బాగుంటుందనేది ఫ్రాంచైజీలు సూచిస్తాయి. ఆ ఆటగాళ్లే వేలంలో మిగులుతారు. 

వేలం ఎలా జరుగుతుంది

పది మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు మినహాయించి మిగిలినవారిని సెట్‌లుగా విభజిస్తారు. ఇందులో బ్యాటర్లు, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్లు, పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు ఉంటారు. కనిష్టంగా 20 లక్షల నుంచి గరిష్టంగా 2 కోట్ల వరకూ బేస్ ప్రైస్ ఉంటుంది. మొత్తం 6 వందలమంది క్రికెటర్లలో 49 మంది బేస్ వ్యాల్యూ 2 కోట్లతో ప్రారంభం కానుంది. అగ్రశ్రేణి ఆటగాళ్ల జాబితాలో అశ్విన్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ థావన్, మొహమ్మద్ షమీ, బౌల్ట్, వార్నర్, కమిన్స్, రబడ, డికాక్, డుప్లెసిస్ ఉన్నారు. ఇక ఇప్పటి వరకూ టీమ్ ఇండియాకు ఆడని అన్ క్యాప్డ్ ప్లేయర్స్‌లో తమిళనాడుకు చెందిన షారుఖ్ కాన్, అవేశ్ ఖాన్‌లపై అందరి దృష్టీ నెలకొంది.

Also read : IND vs WI 3rd ODI: మెరిసిన సిరాజ్, శ్రేయాస్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం! సిరీస్​ క్లీన్​స్వీప్​!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
IPL Mega Auction 2022 today, check how the auction process will be and the list of players
News Source: 
Home Title: 

IPL Mega Auction 2022: మరి కాస్సేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్

IPL Mega Auction 2022: మరి కాస్సేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్, వేలంపాటలో ఆటగాళ్లెవరు
Caption: 
Ipl 2022 mega auction ( fle photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
IPL Mega Auction 2022: మరి కాస్సేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, February 12, 2022 - 07:41
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
61
Is Breaking News: 
No