Sunrisers Hyderabad IPL 2023 Preview and Purse Value: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మినీ వేలం మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది. కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్లో ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో బ్రాడ్ కాస్ట్ అవుతుంది. మరోవైపు లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమాలో వస్తుంది. ఈ మినీ వేలంలో 405 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 273 మంది ఆటగాళ్లు భారతీయులు కాగా, 132 మంది ఆటగాళ్లు విదేశీయులు.
వేలంలో పాల్గొనే మొత్తం 10 ఫ్రాంచైజీలు 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. ఇందులో విదేశీ ఆటగాళ్లకు గరిష్ట స్లాట్ల సంఖ్య 30. ప్రతి ఫ్రాంచైజీ తన జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాలి. ఇందులో 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. ఇక వేలంలో ఆటగాళ్ల గరిష్ట బేస్ ధర రూ. 2 కోట్లు. ఇందులో 19 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 11 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.1.5 కోట్లు. ఇక కోటి రూపాయల కేటగిరీలో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో భారత స్టార్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌తో పాటు విదేశీ ఆటగాళ్లు జో రూట్, కేన్ విలియమ్సన్, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, సామ్ కరన్, లిటన్ దాస్, జాసన్ హోల్డర్, జేమ్స్ నీషమ్, కామెరూన్ గ్రీన్, కార్లోస్ బ్రాత్‌వైట్ ఉన్నారు. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు విలియమ్సన్, పంజాబ్ కింగ్స్‌కు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇద్దరినీ వారి ఫ్రాంచైజీ విడుదల చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి గరిష్టంగా 13 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. సన్‌రైజర్స్ పర్స్‌లో గరిష్టంగా రూ. 42.25 కోట్లు ఉన్నాయి. దాంతో హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లను కొనే అవకాశం ఉంది. బెన్ స్టోక్స్, సామ్ కరన్, కామెరూన్ గ్రీన్‌లు జట్టులోకి వచ్చే అవకాశం. ఇందులో ఇద్దరు వచ్చినా హైదరాబాద్ తలరాత మారిపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అత్యల్పంగా 5 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ పర్స్‌లో అత్యల్పంగా 7.05 కోట్లు ఉండగా.. 11 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. దాంతో కోల్‌కతా పెద్దగా ఖర్చు చేసే అవకాశం లేదు.
ఫ్రాంచైజీల పర్స్ బ్యాలెన్స్:
సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 42.25 కోట్లు
పంజాబ్ కింగ్స్: రూ. 32.2 కోట్లు
లక్నో సూపర్‌జెయింట్స్: రూ. 23.35 కోట్లు
ముంబై ఇండియన్స్: రూ. 20.55 కోట్లు
చెన్నై సూపర్‌కింగ్స్: రూ. 20.45 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 19.45 కోట్లు
గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు
రాజస్తాన్ రాయల్స్: రూ. 13.2 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రూ. 8.75 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్: రూ. 7.05 కోట్లు
Also Read: Kaikala Satyanarayana Dies: కైకాల సత్యనారాయణ మరణంకు అసలు కారణం ఇదే!
Also Read: ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం వేరే.. కైకాల సత్యనారాయణ మరణంపై బాలకృష్ణ, చంద్రబాబు ఎమోషనల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.