KKR Shreyas Iyer: భారీ ధరకు శ్రేయాస్ అయ్యర్‌ను కైవసం చేసుకున్న కేకేఆర్ .. కెప్టెన్‌గా ఎంపిక లాంఛనమే!!

KKR Shreyas Iyer: భారత స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. ఐపీఎల్‌ 2022 వేలంలో భారీ ధర పలికాడు. మార్కీ (అత్యంత ముఖ్యమైన) జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 01:16 PM IST
  • ఐపీఎల్‌ 2022 మెగా వేలం షురూ
  • అయ్యర్‌ను కైవసం చేసుకున్న కేకేఆర్
  • కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయాస్ ఎంపిక లాంఛనమే
KKR Shreyas Iyer: భారీ ధరకు శ్రేయాస్ అయ్యర్‌ను కైవసం చేసుకున్న కేకేఆర్ .. కెప్టెన్‌గా ఎంపిక లాంఛనమే!!

Shreyas Iyer signed by Kolkata Knight Riders for Rs 12.25 crore: భారత స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 వేలంలో భారీ ధర పలికాడు. మార్కీ (అత్యంత ముఖ్యమైన) జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అయ్యర్‌కే అత్యధిక ధర. అంతేకాదు 10 కోట్లకు పైగా అమ్ముడుపోయిన ప్లేయర్ కూడా మనోడే. అయ్యర్ బేస్ ప్రెస్ 2 కోట్లు కాగా.. 12.25 కోట్లకు కేకేఆర్ కైవసం చేసుకుంది. 

వేలంలో శ్రేయాస్ అయ్యర్ పేరు రాగానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు ఆసక్తి చూపాయి. కోల్‌కతా మొదటి నుంచి అయ్యర్‌ను దక్కించుకునేందుకు పోటీ పడింది. మధ్యలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి పోటీ ఇచ్చినా కేకేఆర్ వెనక్కి తగ్గలేదు. చివరకు  12.25 కోట్లకు కోల్‌కతా కైవసం చేసుకుంది. 

శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి రావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ ప్రాబ్లెమ్ తీరినట్టే. ఇదివరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం అయ్యర్‌కు ఉంది. 2020 సీజన్లో ఢిల్లీని అయ్యర్ ఫైనల్స్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కోల్‌కతాకు కెప్టెన్ అవసరం ఉంది కాబట్టే.. అయ్యర్‌కు అంత వెచ్చించింది. ఇక శ్రేయాస్ కోల్‌కతా కెప్టెన్ కావడం లాంఛనే అయింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి. 

శ్రేయాస్ అయ్యర్ మంచి బ్యాటర్ మాత్రమే కాకుండా.. ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇక సారథ్యం అతడికి అదనపు బలం. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాదిరే అయ్యర్ కూడా చాలా కూల్. అయ్యర్ ఐపీఎల్ టోర్నీలో 87 మ్యాచులు ఆడి 2375 పరుగులు చేశాడు. ఇక భారత్ తరఫున 2 టెస్టులు, 25 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. 

Also Read: IPL Auction 2022: శిఖర్ ధావన్‌ను కైవసం చేసుకున్న పంజాబ్ కింగ్స్.. అభిమానులకు మాత్రం బ్యాడ్‌న్యూస్‌!!

Also Read: Prema Entha Madhuram: వాలెంటైన్స్ డే స్పెషల్.. రియల్ కపుల్స్‌తో ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News